కాబుల్​ గురుద్వారాపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి.. ఖండించిన మోదీ

author img

By

Published : Jun 18, 2022, 10:20 AM IST

Updated : Jun 18, 2022, 10:03 PM IST

Explosions heard in Gurudwara Karte Parwan area of Kabul city in Afghanistan
Explosions heard in Gurudwara Karte Parwan area of Kabul city in Afghanistan ()

21:54 June 18

మోదీ ట్వీట్:
కాబుల్​లోని కర్తా పర్వ్​ గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. క్రూరమైన ఈ ఘటనను తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా మోదీ అభివర్ణించారు. భక్తుల సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

10:13 June 18

కాబుల్​ గురుద్వారాపై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి.. ఖండించిన మోదీ

Explosions In Kabul Gurudwara: అఫ్గానిస్థాన్​ కాబుల్​లోని గురుద్వారా కర్తా పర్వ్​పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్​ ప్రాంగణంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. గురుద్వారా గేటు బయట దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పేలుళ్లతో పక్కనే ఉన్న షాపులు కూడా దగ్ధమయ్యాయని చెబుతున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరు అఫ్గాన్లు చనిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు.. భాజపా ఎమ్మెల్యే, భారతీయ సిక్కు నేత మన్​జిందర్​ సిర్సా కూడా ట్వీట్​ చేశారు. బుల్లెట్​ గాయాలతో చనిపోయిన ఓ వ్యక్తి ముస్లిం అని పేర్కొన్నారు. లోపల ఇంకా కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. సంబంధిత వీడియోలను కూడా ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఓ ఉగ్ర ముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. అఫ్గాన్​లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పవిత్ర గురుద్వారాపై దాడి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో.. భారత విదేశీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఉగ్రదాడి పట్ల ఆందోళన చెందుతున్నామని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ట్వీట్​ చేసింది.

Last Updated :Jun 18, 2022, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.