ETV Bharat / international

సైనికులపై తీవ్రవాదుల దాడి.. 9 మంది మృతి

author img

By

Published : Mar 29, 2023, 8:51 PM IST

Updated : Mar 29, 2023, 10:06 PM IST

కొలంబియాలో మిలిటెంట్లు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కొలంబియా, వెనిజులా దేశ సరిహద్దు వద్ద ఉన్న సమస్యాత్మక ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు నేషనల్​ లిబరేషన్​ ఆర్మీ లేదా ఈఎల్​ఎన్​ గెలిల్లా గ్రూప్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

colombia-attack-militants-killed-soldiers-in-colombia
మిలిటెంట్ల దాడుల్లో తొమ్మిది మంది సైనికులు మృతి

కొలంబియాలో మిలిటెంట్లు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కొలంబియా, వెనిజులా దేశ సరిహద్దు వద్ద ఉన్న సమస్యాత్మక ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు నేషనల్​ లిబరేషన్​ ఆర్మీ లేదా ఈఎల్​ఎన్​ గెలిల్లా గ్రూప్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు. కాగా ఈఎల్​ఎన్​ తీవ్రవాదుల కోసం తమ ఆపరేషన్​ను కొనసాగిస్తూనే ఉంటామని కొలంబియా మిలటరీ కమాండర్​ మేజర్ బ్రైట్ గిరాల్ తెలిపారు.

2016లో ప్రభుత్వానికి, రివల్యూషనరి ఆర్మ్​డ్ ఫోర్సెస్​ ఆఫ్​ కొలంబియాకి (ఎఫ్ఏఆర్​సీ) మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగినప్పటికి.. కొలంబియాలో కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఇంకా డ్రగ్స్​ గ్యాంగ్​, రెబర్​ గ్రూప్​ ఆధీనంలో ఉన్నాయి. ఈఎల్​ఎల్​ 1964లో క్యూబా విప్లవం స్పూర్తితో పురుడు పోసుకుంది. ఈ సంస్థ కొలంబియా దాని పొరుగున ఉన్న వెనిజులాలో దాదాపు 2,000 నుంచి 4,000 దళాలను కలిగి ఉంది. ఈ దళాలు మాదక ద్రవ్యాల, అక్రమ బంగారు గనులు రవాణాకు పాల్పడుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్​ వెల్లడించింది.

పాక్​స్థాన్​లోనూ ఇదే తరహా ఘటన..
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో ఇదే తరహా దాడులు జరిగాయి. పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. భారీగా ఆయుధాలు ధరించిన 8 మంది పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్లు కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయంపై కాల్పులకు దిగారు. పోలీసులు, సైన్యం ప్రతిఘటించడం వల్ల ఐదుగురు తీవ్రవాదులు, ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. పోలీసుల యునిఫామ్‌ ధరించి ఉగ్రవాదులు.. పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించినట్లు డీఐజీ ఇర్ఫాన్ తెలిపారు. పోలీసులు ఎదురుకాల్పులకు దిగడం వల్ల ముగ్గురు తీవ్రవాదులు తమను తాము కాల్చుకొని చనిపోయినట్లు డీఐజీ ఇర్ఫాన్ వెల్లడించారు. ఉగ్రవాదులు మెుదట గ్రనెడ్లతో దాడి చేసి.. అనంతరం విచక్షణరహితంగా కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కార్యాలయంలోకి ప్రవేశించారని వారు వెల్లడించారు.

మాలి దేశంలోనూ..
జనవరిలోనూ మాలి దేశ సైనికులపై ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. వీరు జరిపిన దాడిలో 14 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు గాయపడ్డారు. సెంట్రల్ మాలిలోని కౌమారా, మాసినా పట్టణాల మధ్య ఈ పేలుళ్లు జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మరో రెండు గ్రామాల్లో కూడా తీవ్రవాదులు దాడి చేసినట్లు వారు వెల్లడించారు.

Last Updated :Mar 29, 2023, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.