ETV Bharat / international

China Taiwan Conflict : చైనా కవ్వింపు చర్యలు.. 24 గంటల్లో 103 యుద్ధ విమానాలు పంపి..

author img

By PTI

Published : Sep 18, 2023, 9:43 AM IST

Updated : Sep 18, 2023, 10:32 AM IST

China Taiwan Conflict
చైనా తైవాన్ వివాదం

China Taiwan Conflict : చైనా, తైవాన్​ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలో తమ దేశం వైపుగా 103 యుద్ధ విమానాలను చైనా పంపించిందని తైవాన్​ ఆరోపించింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు వీటిని గుర్తించినట్లు తెలిపింది.

China Taiwan Conflict : 103 యుద్ధ విమానాలను తమ దేశం​ వైపుగా చైనా పంపించిందని ఆరోపించింది తైవాన్. 24 గంటల వ్యవధిలో ఈ విమానాలు తమ భూభాగం వైపు వచ్చినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీటిని గుర్తించినట్లు తైవాన్​ రక్షణ శాఖ వెల్లడించింది. ఎప్పటిలాగే అవి తైవాన్​ భూతల సరిహద్దు వరకు వచ్చి అనంతరం వెనుదిరిగాయని పేర్కొంది. 40 విమానాలు మాత్రం చైనా, తైవాన్​ మధ్య ఉన్న సింబాలిక్ హాఫ్‌వే పాయింట్ దాటాయని తైవాన్​ వెల్లడించింది. అంతకు ముందు కూడా తొమ్మిది చైనా నౌకలను తమ సరిహద్దులో గుర్తించినట్లు తైవాన్​ తెలిపింది. దీన్ని కవ్వింపు చర్యగా పేర్కొన్న తైవాన్​.. చైనాపై మండిపడింది.

జనవరిలో తైనాన్​ అధ్యక్ష ఎన్నికలు..
China Taiwan Dispute : జనవరిలో తైనాన్​ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తైవాన్​లో అలజడి సృష్టించేందుకే చైనా ఈ చర్యలకు పాల్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ.

నిత్యం ఉద్రిక్తలతో చైనా తైవాన్ సరిహద్దు..
China Taiwan Controversy : స్వయం పాలిత ద్వీపమైన తైవాన్‌ను తమ భూభాగంగా పేర్కొంటోంది చైనా. బలవంతంగానైనా తమ దేశంలో తైవాన్​ కలుపుకుంటామని ఇటీవల ప్రకటించింది. ఈ తరుణంలోనే తైవాన్‌ను భయపెట్టేందుకు గత కొంత కాలంగా చైనా ప్రయత్నాలు చేస్తోంది. తరచూ తైవాన్‌ వైపు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను పంపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తైవాన్‌ సమీపంలో యుద్ధ విన్యాసాలను కూడా చైనా నిర్వహించింది.

తైవాన్​ మాత్రం తమ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. తైవాన్​ భద్రత స్థిరత్వానికి విఘాతం కలిగించేందుకు, పాల్పడుతున్న చైనా చర్యలను ఖండిస్తూ వస్తోంది. 1949లో చైనాలో జరిగిన అంతర్యుద్ధం సమయంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు కమ్యూనిస్టులు. అనంతరం జాతీయవాదులంతా తైవాన్​ పారిపోయి.. ద్వీప దేశంలో తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

చైనా దాడులను తిప్పికొట్టేందుకు తైవాన్​ నయా ప్లాన్​!.. రంగంలోకి కొత్త జలాంతర్గామి!

తైవాన్, చైనా మధ్య యుద్ధ మేఘాలు!.. 68 యుద్ధ విమానాలను మోహరించిన డ్రాగన్​

Last Updated :Sep 18, 2023, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.