ETV Bharat / international

China Minister Removed : చైనా రక్షణ మంత్రి తొలగింపు.. 2నెలలుగా కనిపించకుండా పోయారని..

author img

By PTI

Published : Oct 24, 2023, 5:45 PM IST

Updated : Oct 24, 2023, 7:39 PM IST

China Minister Removed
లీ షాంగ్ఫు

China Minister Removed : రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూను పదవి నుంచి తొలగించినట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన స్థానంలో కొత్తగా ఎవర్ని నియమించిందో వెల్లడించలేదు.

China Minister Removed : దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోయిన చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫూను జిన్​పింగ్ సర్కార్​ తొలగించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. షాంగ్‌ఫూ తొలగింపునకు జాతీయ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. అయితే షాంగ్​ఫూ ఉద్వాసనకు కారణమేంటన్నది మాత్రం చెప్పలేదు. ఆయన స్థానంలో కొత్తగా ఎవర్ని నియమించిందో కూడా వెల్లడించలేదు. షాంగ్​ఫూతో పాటు ఆర్థిక మంత్రి లియు కున్​ను తొలగించి.. ఆయన స్థానంలో లాన్ ఫోయాన్​ను నియమించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్‌ను తొలగించి.. ఆయన స్థానంలో యిన్ హెజున్‌ను నియమించినట్లు అధికారికంగా తెలిపింది.

జిన్‌పింగ్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి..
China Defence Minister Missing : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికవేత్తల నుంచి మంత్రుల వరకు చాలా మంది అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అప్పటి చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ ఇలానే అదృశ్యమయ్యారు. అమెరికా మాజీ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్‌ వచ్చినప్పుడు కూడా కిన్​ గాంగ్‌ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనను తప్పించి.. విదేశాంగ శాఖ బాధ్యతలను అంతకుముందు నిర్వహించిన వాంగ్‌ యీకి అప్పగించారు.

ఆ సదస్సు తర్వాత మాయం
China Defence Minister Disappeared : ఆ తర్వాత చైనా రక్షణ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫూ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. షాంగ్‌ఫూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడన్న పేరు ఉంది. 2023 మార్చిలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు షాంగ్​ఫూ. ఆగస్టు 29న అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న తర్వాత షాంగ్​ఫూ కనిపించకుండా పోయారు.

ఆ కేసుల విచారణ జరుగుతున్న సమయంలోనే..
China Hardware Case : అయితే చెైనాలో హార్డ్‌వేర్ కొనుగోలుకు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుపుతున్న సమయంలోనే లీ షాంగ్‌ఫూ కనిపించకుండాపోయారు. ఈ కేసులపై 2017 నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు చైనా మిలిటరీ వెల్లడించింది. 2017 నుంచి 2022 మధ్య లీ షాంగ్‌ఫూ ఎక్విప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యకలాపాలు చూశారు. ఆ సమయంలో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా వినిపించలేదని తెలుస్తోంది.

Khalistan Nijjar Killed : 'నిజ్జర్​ హత్యలో చైనా ఏజెంట్ల ప్రమేయం.. ఇండియన్ ఇంగ్లిష్ నేర్చుకొని మరీ..'

China Birth Rate 2023 : ప్రపంచంలోనే వృద్ధ దేశంగా చైనా!.. భారీగా తగ్గిన జననాలు.. డ్రాగన్‌ కలవరం

Last Updated :Oct 24, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.