ETV Bharat / international

'వారం రోజుల్లోనే 21% పెరిగిన కరోనా మరణాలు'

author img

By

Published : Jul 28, 2021, 6:20 PM IST

Updated : Jul 28, 2021, 6:52 PM IST

గడిచిన వారంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మృతుల సంఖ్య 21శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 8 శాతం పెరిగినట్లు తెలిపింది.

World Health Organisation
ప్రపంచ ఆరోగ్య సంస్థ

వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 21 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. వీటిలో అత్యధికంగా 69,000 మరణాలు అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే నమోదైనట్లు పేర్కొంది.

అలాగే కరోనా కేసుల సంఖ్య సైతం 8 శాతం పెరిగినట్లు వెల్లడించింది డబ్ల్యూహెచ్​ఓ. ఫలితంగా మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 19 కోట్ల 40 లక్షలకు చేరినట్లు పేర్కొంది.

"పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. రానున్న వారంలోనే మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 20 కోట్లు దాటుతుంది. ఐరోపాలో తప్ప అన్ని ప్రాంతాల్లో కరోనా మరణాలు పెరిగాయి. అలాగే అమెరికా, బ్రెజిల్​, ఇండోనేషియా, బ్రిటన్​, భారత్​లో భారీగా కేసులు నమోదవుతున్నాయి."

- ప్రపంచ ఆరోగ్య సంస్థ

అలా చేస్తే కొన్నివారాల్లోనే వైరస్​ అంతం!

మరోవైపు.. భారీగా టీకాల పంపిణీ, మాస్క్​ ధరించడంపై కొత్త మార్గదర్శకాల జారీ చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని కొన్ని వారాల్లో కట్టడి చేయవచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) డైరెక్టర్​ డాక్టర్​ రోచెల్​​ వాలెన్​స్కీ పేర్కొన్నారు. కఠిన నిబంధనలను పాటించడం ద్వారా కరోనా సంక్రమణను నియంత్రించవచ్చన్నారు.

ఇదీ చూడండి: ప్రపంచ దేశాల్లో కేసులు తీవ్రం- మూడోవేవ్ మొదలైనట్టేనా?

Last Updated : Jul 28, 2021, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.