ETV Bharat / international

మోడెర్నా టీకాకు డబ్ల్యూహెచ్​ఓ పచ్చ జెండా

author img

By

Published : May 1, 2021, 9:47 PM IST

మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. కొద్దిరోజుల్లో చైనాకు చెందిన రెండు టీకాలు కూడా ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

Moderna, WHO
మోడెర్నా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ పచ్చ జెండా

మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆస్ట్రాజెనె​కా,ఫైజర్-బయోఎన్​టెక్​​, జాన్సన్​&జాన్సన్​ టీకాలకు అనుమతి లభించగా.. తాజా నిర్ణయంతో ఆ జాబితాలో చేరింది మోడెర్నా వ్యాక్సిన్​. చైనాకు చెందిన సినోఫార్మ, సినోవాక్ వ్యాక్సిన్​కు త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఎంఆర్​ఎన్​ఏ ఫార్మా సంస్థ నుంచి క్లినికల్​ డేటా పొందడంలో జాప్యం కారణంగా టీకా అనుమతికి ఆలస్యం అయినట్లు డబ్ల్యూహెచ్​ఓ వివరించింది.

సొంతంగా ఔషధ నియంత్రణ సంస్థలు లేని దేశాలు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి ఇచ్చిన టీకాలను కరోనా కట్టడికి ఉపయోగిస్తాయి. అయితే.. మోడెర్నా అనుమతులు వ్యాక్సిన్​ సరఫరాపై తక్షణ ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మోడెర్నా తయారీదారులు ప్రపంచంలోని పలు ధనిక దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారు. వారికి టీకాలు అందించటంలోనే చాలా సమయం పట్టనుంది.

ఇదీ చూడండి: నేడు భారత్​కు రానున్న 'స్పుత్నిక్' టీకా డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.