ETV Bharat / international

Covid cases: బ్రిటన్​లో ఒక్కరోజే 88 వేల కరోనా కేసులు- ఇదే రికార్డ్​!

author img

By

Published : Dec 17, 2021, 2:05 AM IST

Covid cases: బ్రిటన్​లో ఒక్కరోజే 88 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు.

uk covid cases
కరోనా కేసులు బ్రిటన్

Covid cases: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటితో పాటు కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు కూడా యూకే లో బాగా పెరిగాయి. కొత్తగా 1,691 మందిలో ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,708 కి చేరింది.

యూకేలో మరో 146 మంది వైరస్​ కారణంగా చనిపోయినట్లు అధికారుల వెల్లడించారు. దీంతో మొత్తం మరణాలు 1,47,937 కు చేరాయి. అంతేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వ్యాప్తి బ్రిటన్​లో ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్​ కేసులు రెండు నుంచి మూడు రోజుల్లో రెట్టింపు అవుతున్నాయని వైద్యాధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్​ 16 నాటికి 25,477,345 మందికి బూస్టర్​ డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఆఫ్రికాలో వ్యాక్సినేషన్​ పై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన..

ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సినేషన్​ శాతం దారుణంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. వ్యాక్సినేషన్ రేటు ప్రపంచ వ్యాప్తంగా 44 శాతం ఉంటే... ఆఫ్రికాలో కేవలం 8 శాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఒమిక్రాన్​ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.