ETV Bharat / international

బైడెన్​కు బ్రిటన్​ రాణి ఆతిథ్యం!

author img

By

Published : Jan 31, 2021, 7:21 PM IST

బ్రిటన్​లో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్న అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్​కు బ్రిటన్​ రాణి ఎలిజిబెత్​-2 ఆతిథ్యమివ్వనున్నారు. జూన్​లో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Queen likely to host Joe Biden at Buckingham Palace: Report
బైడెన్​కు బ్రిటన్​ రాణి ఆతిథ్యం!

ఈ ఏడాది బ్రిటన్​లో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు ఆతిథ్యమివ్వనున్నారు ఎలిజిబెత్ రాణి. ఆమె అధికారిక నివాసం బకింగ్​హామ్​ ప్వాలెస్​కు బైడెన్​ వెళ్లనున్నారని అక్కడి మీడియా తెలిపింది.

కరోనా లాక్​డౌన్​ కారణంగా గతేడాది నుంచి విండ్​సర్​లోని నివాసం ఉంటున్న ఎలిజిబెత్​.. త్వరలో లండన్​ చేరుకోనున్నారు. అనంతరం బైడెన్​​తో తొలిసారిగా దౌత్యపరమైన చర్చలు జరపనున్నారు.

జూన్​లో జరగనున్న జీ-7దేశాల (బ్రిటన్​, కెనడా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇటలీ, జపాన్​, అమెరికా) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొనున్న తెలుస్తోంది. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆహ్వానం మేరకు మోదీ అతిథిగా హాజరవనున్నారు.

ఇదీ చూడండి: చైనాకు పాక్​ ప్రత్యేక విమానం.. వ్యాక్సిన్​ కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.