ETV Bharat / international

ప్రిన్స్​ ఫిలిప్​కు మోదీ సహా ప్రపంచ నేతల నివాళి

author img

By

Published : Apr 9, 2021, 7:25 PM IST

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనతో పాటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ కూడా సానుభూతి ప్రకటించారు.

PM modi condoles Prince Philip's demise
ప్రిన్స్​ ఫిలిప్​కు మోదీ సహా ప్రపంచ నేతల నివాళి

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్​ మృతి పట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బ్రిటన్ ప్రజలు, రాజకుటుంబానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

"ప్రిన్స్​ ఫిలిప్​ మృతి పట్ల బ్రిటన్ ప్రజలు, రాజకుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సైన్యంలో ఆయన విశిష్టమైన విధులు నిర్వర్తించారు. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

99 సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం మరణించారు ఫిలిప్.

ప్రిన్స్​ ఫిలిప్ మృతితో బ్రిటన్​ పూర్తిగా శోకసంద్రంలో మునిగింది. ఓ కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపేసి.. జాతీయ గీతాన్ని ప్రసారం చేసింది బీబీసీ.

లండన్​లోని బకింగ్​హామ్​ ప్యాలెస్​లో జాతీయ జెండాను అవనతం చేశారు. రాయల్​ ఫ్యామిలీ వెబ్​సైట్​లో ఫిలిప్​ బ్లాక్​ అండ్ వైట్ ఫొటో పెట్టారు.

PM modi condoles Prince Philip's demise
ప్రిన్స్ ఫిలిప్​

బ్రిటన్ ప్రధాని సంతాపం..

"రెండో ప్రపంచ యుద్ధంలో నావల్​ హీరోగా ఎంతో మంది యువతను ప్రిన్స్​ ఫిలిప్​ ప్రభావితం చేశారు. బ్రిటన్​, కామన్​వెల్త్ దేశాల్లో​ మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తంచేస్తున్నా. దేశానికి ఆయన చేసిన దశాబ్దాల నిస్వార్థ సేవకు కృతజ్ఞతలు."

- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

"రాజకుటుంబాన్ని, రాచరికాన్ని జాగ్రత్తగా నడిపించడంలో ప్రిన్స్ ఫిలిప్ తోడ్పడ్డారు. ఆ విధంగా దేశ ప్రజలు సంతోషంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా జీవించడంలో కీలక పాత్ర పోషించారు. రాణితో వారి వివాహ బంధం.. నమ్మకం, స్థిరత్వం, దృఢత్వానికి ప్రతీక. ప్రిన్స్ ఫిలిప్ చిరకాలం గుర్తుండిపోతారు." అని ప్రతిపక్ష లేబర్​ పార్టీ నేత కీర్​ స్టార్మర్ కొనియాడారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ఆయన భార్య లారా.. ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు.

"ప్రిన్స్ ఫిలిప్​.. యూకేకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యం వహించారు. బ్రిటన్ సార్వభౌమాధికారానికి అనంతమైన బలం, మద్దతు చేకూర్చారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం."

- జార్జి​ బుష్, అమెరికా మాజీ అధ్యక్షుడు

రాణి ఎలిజెబెత్, రాజకుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు బుష్ దంపతులు ప్రకటించారు.

ఇదీ చూడండి: 'గోడపై లవ్​ సింబల్స్​'తో కొవిడ్​ మృతులకు నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.