ETV Bharat / international

అమెరికాపై కరోనా పంజా.. ఒక్కరోజే 81 వేల కేసులు

author img

By

Published : Oct 24, 2020, 8:59 AM IST

Global COVID-19
కరోనా మహమ్మారి

ప్రపంచంపై కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. జనసాంద్రత అధికంగా ఉన్న దేశాలతో పాటు చిన్న దేశాల్లోనూ వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 4.90 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. కొలంబియాలో కేసులు 10 లక్షలకు చేరువయ్యాయి. అమెరికాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 81 వేల కేసులు.. 903 మరణాలు నమోదయ్యాయి.

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్​ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 4.90 లక్షల కేసులు వెలుగుచూశాయి. మరో ఆరున్నర వేల మందికిపైగా వైరస్​కు బలయ్యారు. మొత్తం మరణాలు 11 లక్షల 49 వేలు దాటాయి. అమెరికా, భారత్​తో పాటు ఫ్రాన్స్​, బ్రిటన్​, బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. ఫ్రాన్స్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది.

మొత్తం కేసులు: 42,487,519

మరణాలు: 1,149,212

కోలుకున్నవారు: 31,423,343

యాక్టివ్​ కేసులు: 9,914,964

  • అమెరికాలో వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం మరో 81 వేల మంది వైరస్​ బారినపడ్డారు. 903 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 87 లక్షలు దాటింది. రోగులతో ఆసుపత్రులు రద్దీగా మారాయి.
  • ఫ్రాన్స్​లో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. పశ్చిమ ఐరోపా దేశాల్లో స్పెయిన్​ తర్వాత ఈ మార్క్​ను దాటిన రెండో దేశంగా, ప్రపంచవ్యాప్తంగా ఏడో దేశంగా నిలిచింది ఫ్రాన్స్​. శుక్రవారం కొత్తగా 42వేలకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే.. వాస్తవానికి వైరస్​ బారిన పడిన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండోర్​ ఐస్​ స్కేటింగ్​లపై రెండు వారాల నిషేధం విధించింది మసాచుసెట్స్​. ఐస్​ హాకీ కారణంగా 38 క్లస్టర్లలో వైరస్​ వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
  • టర్కీలో వైరస్​ విజృంభిస్తోంది. మే 6 తర్వాత తొలిసారి శుక్రవారం రికార్డు స్థాయిలో 2,165 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,57,693కు చేరింది.
  • అర్జెంటీనాలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను నవంబర్​ 8 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్​.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా8,746,953229,284
బ్రెజిల్​5,355,650156,528
రష్యా1,480,64625,525
స్పెయిన్​ 1,110,37234,752
అర్జెంటీనా1,069,36828,338
ఫ్రాన్స్​1,041,07534,508
కొలంబియా998,94229,802
పెరు883,116 34,033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.