ETV Bharat / international

అమర్త్యసేన్​కు జర్మనీ శాంతి పురస్కారం

author img

By

Published : Oct 19, 2020, 7:47 AM IST

భారత ఆర్థికవేత్త, నోబెల్​ గ్రహీత అమర్త్య సేన్​ను జర్మన్​ బుక్​ ట్రేడ్​ శాంతి పురస్కారం వరించింది. అమెరికాలో ఉన్న ఆయన ఈ అవార్డును వర్చువల్​ విధానంలో అందుకున్నారు.

German Peace Prize get Amartya Sen
అమర్త్యసేన్​కు జర్మనీ శాంతి పురస్కారం

జర్మన్​ బుక్​ ట్రేడ్​ శాంతి పురస్కారం.. భారత ఆర్థికవేత్త, నోబెల్​ గ్రహీత అమర్త్య సేన్​ను వరించింది. ప్రపంచ న్యాయం, విద్యలో సామాజిక అసమానతలు, ఆరోగ్య సంరక్షణ సమస్యలను పరిష్కరించేందుకు తన మార్గదర్శక కృషికి ఈ బహుమతి దక్కింది.

అమెరికాలో ఉన్న ఆయన అవార్డు స్వీకరణకు జర్మనీకి రాలేకపోవడం వల్ల ఆదివారం వర్చువల్​గా అందజేశారు. 1950 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డుతో పాటు 25 వేల యూరోలు బహుమతిగా ఇస్తారు.

ఇదీ చూడండి: అక్కడ కిలో 'జీడిపప్పు' ధర రూ.30లోపే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.