ETV Bharat / international

'బూస్టర్‌ డోసుతో ఒమిక్రాన్​ నుంచి సమర్థమైన రక్షణ'

author img

By

Published : Jan 20, 2022, 2:25 PM IST

Corona Booster Dose
టీకా

Corona Booster Dose: కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసు వల్ల ఒమిక్రాన్‌ నుంచి సమర్థమైన యాంటీబాడీ రక్షణ లభిస్తోందని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. లాన్సెట్‌ జర్నల్​లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. టీకా రెండు డోసులు వేసుకున్న వారితో పోలిస్తే మూడు డోసులు వేసుకున్న వారిలో 2.5 రెట్లు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

Corona Booster Dose: కరోనా టీకా మూడో డోసు యాంటీబాడీల స్థాయిని పెంచుతోందని, తద్వారా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను తటస్థీకరించడంలో ప్రభావవంతంగా పని చేస్తోందని మరో అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ రీసర్చ్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. లాన్సెట్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

Omicron News: ఫైజర్‌ లేదా అస్ట్రాజెనెకా టీకా రెండు డోసులు అందుకున్న వారిలో ఉత్పత్తి అయిన ప్రతిరక్షకాలు అల్ఫా, డెల్టా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై అంతగా ప్రభావం చూపడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. రెండో డోసు తీసుకున్న తర్వాత మూడు నెలల్లో యాంటీబాడీ స్థాయిలు తగ్గుతున్నట్లు స్పష్టమైంది. బూస్టర్‌ డోసు తీసుకోవడం వల్ల యాంటీబాడీలు పెరిగి ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడంలో సమర్థంగా పని చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒమిక్రాన్‌పై టీకా రెండు డోసులు తీసుకున్న వారి కంటే మూడు డోసులు తీసుకున్న వారిలో యాంటీబాడీలు 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధరించారు. గతంలో కొవిడ్‌ సోకి, రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో కూడా యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. యాంటీబాడీల స్థాయి పెరిగి కొవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలవకుండా లేదా ఆస్పత్రిలో చేరకుండా ఉండాలంటే మూడో డోసు అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

364 మంది నుంచి సేకరించిన 620 రక్త నమూనాలను ఈ అధ్యయనంలో వారు పరిశీలించారు. ఒమిక్రాన్‌ సహా వేర్వేరు వేరియంట్లు కణాల్లోకి ప్రవేశించకుండా యాంటీబాడీల సామర్థ్యాన్ని ఇందులో పరీక్షించారు. రెండు డోసుల ద్వారా పొందిన రోగ నిరోధకతను ఒమిక్రాన్‌ తప్పించుకుంటోందని, ఐతే మూడో డోసు వల్ల దీన్ని ఎదుర్కొనే సామర్థ్యం చాలామందిలో కలుగుతోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. తద్వారా వైరస్‌ సోకకుండా లేదా తీవ్ర అనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు మూడో డోసు సహకరిస్తోందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: భారత్​లో కరోనా కల్లోలం- ఒక్కరోజే 3 లక్షలకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.