ETV Bharat / international

రెండు వేర్వేరు టీకా డోసులు కలపొచ్చా?

author img

By

Published : Jun 17, 2021, 6:23 PM IST

కొవిడ్​ టీకాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో రెండు వేర్వేరు టీకా డోసులను కలపొచ్చా? అనే దిశగా బ్రిటన్​లో పరిశోధనలు చేస్తున్నారు.

COVID-19 vaccines combination
కరోనా టీకాల కాంబినేషన్

ప్రపంచ దేశాలను టీకాల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఓ కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు బ్రిటన్​ శాస్త్రవేత్తలు. రెండు వేర్వేరు టీకా డోసులను కలపొచ్చా? అలా కలిపిన టీకాలు సమర్థంగా పని చేస్తాయా? అనే కోణంలో పరిశోధనలు చేస్తున్నారు.

"ఫైజర్​, ఆస్ట్రాజెనికా, మోడెర్నా సహా మరికొన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటి పని తీరు ఒకేలా ఉంటుంది. కొవిడ్​తో పోరాడే యాంటీబాడీలను తగిన పరిమాణంలో ఉత్పత్తి చేయడమే టీకాల పని. అయితే వాటి తయారీ విధానంలో తేడాలున్నాయి. అందుకే టీకా పనితీరు ఆధారంగా.. రెండు వేర్వేరు టీకాలను కలిపి, వాటిని అధ్యయనం చేయాలని భావిస్తున్నాం" అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని వ్యాక్సిన్ విభాగానికి చెందిన డాక్టర్ కాటే ఓబ్రెయిన్​ పేర్కొన్నారు.

ఆస్ట్రాజెనికా- మోడెర్నా, నోవావాక్స్​- పైజర్​ టీకాల కాంబినేషన్లను బ్రిటన్​లోని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలే స్పెయిన్​, జర్మనీ దేశాల్లో జరుగుతున్నాయి. ఇప్పటివరకు లభించిన పరిమిత డేటా ఆధారంగా ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు సురక్షితమైనవని తెలుస్తోంది. ఈ రెండు కాంబినేషన్​తో రూపొందించిన డోసుతో.. ఒంటి నొప్పులు, చలి లాంటి తాత్కాలిక దుష్ప్రభావాల కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇంకా ప్రతి టీకా కాంబినేషన్‌లో సరైన ఆధారాలు అవసరమని పేర్కొన్నారు.

వివిధ రకాల వ్యాక్సిన్ల కాంబినేషన్​ రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమకు నచ్చిన రెండు రకాల టీకాలను తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ఐరోపా దేశాలు.. తొలి డోసులో ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారికి ఫైజర్​ లేదా మోడెర్నా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: ఒక్క ఫ్లాష్​తో సింహాలను పరుగెత్తించి.. హీరోగా మారి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.