ETV Bharat / international

రష్యా 'స్పుత్నిక్​ వీ' టీకాపై భారతీయుల్లో అమితాసక్తి!

author img

By

Published : Nov 20, 2020, 12:37 PM IST

రష్యాకు చెందిన కొవిడ్​ టీకా 'స్పుత్నిక్-​ వీ'ని తీసుకునేందుకు భారత్​లో 86 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ సర్వేలో తేలింది. తమ టీకా సమర్థతపై నమ్మకంతోనే వివిధ దేశాల్లోని ప్రజలు వ్యాక్సినేషన్​ కోసం ఆసక్తి చూపుతున్నారని రష్యా చెబుతోంది.

86 percent of Indian respondents ready for SputnikV vaccination, says survey
రష్యా 'స్పుత్నిక్​ వీ' టీకాపై భారతీయుల్లో అమితాసక్తి!

భారత్​లో 86శాతం మంది.. రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్​-వీ' కొవిడ్​ టీకాను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. బ్రిటన్​కు చెందిన యుగోవ్​ అనే.. మార్కెట్​ రీసెర్చ్​ అండ్​ డేటా అనలిటిక్స్​ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. కరోనా వైరస్​ను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్​ చేయించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలిపింది.

భారత్​ సహా 11 దేశాల్లో ఈ సంస్థ సర్వే చేపట్టింది. బ్రెజిల్​, ఈజిప్ట్​, ఇండోనేసియా, మలేసియా, మెక్సికో, నైజీరియా, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్​, యూఏఈ, వియత్నాం దేశాల్లో సర్వే జరిగింది. అక్టోబర్ 9 నుంచి 15వ తేదీ మధ్య ఈ సర్వే చేపట్టారు. మొత్తం 12,000 మందిలో 73 శాతం మంది రష్యా టీకా తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్​ విషయంలో మధ్య, దక్షిణాసియా దేశాలపై చేపట్టిన సర్వేల్లో ఇదే అతిపెద్దది.

సర్వేలో అధికంగా 96 శాతం.. వియత్నాంకు చెందిన ప్రజలు 'స్పుత్నిక్​ వీ' వ్యాక్సిన్​ కోసం సిద్ధంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. తర్వాత బ్రెజిల్​(89%), భారత్​(86%), మలేసియా(89%) దేశాలు నిలిచాయి. రష్యన్​ ప్రత్యక్ష పెట్టుబడి నిధి(ఆర్​డీఐఎఫ్​) , రష్యా సౌభ్రాతృత్వ నిధి సంస్థల ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. నమ్మకం, భద్రత, సమర్థత ఆధారంగా తమ 'స్పుత్నిక్-​ వీ' టీకాను వినియోగించేందుకు అత్యధికులు ఆసక్తి చూపుతున్నారని ఆర్​డీఐఎఫ్​ పేర్కొంది.

భారత్​లో స్పుత్నిక్​ వీ టీకా రెండో, మూడో దశల క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు డా.రెడ్డీస్​ ల్యాబ్​తో సెప్టెంబర్​లో ఒప్పందం కుదుర్చుకుంది రష్యా.

ఇదీ చూడండి:'భారత్​, చైనాలో మా టీకాను ఉత్పత్తి చేస్తాం'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.