ETV Bharat / international

తాలిబన్లతో నిరంతరం టచ్​లో పాక్​ సైన్యం!

author img

By

Published : Sep 21, 2021, 3:50 PM IST

అఫ్గానిస్థాన్​లో అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో(Afghan Taliban) సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పాకిస్థాన్ వెల్లడించింది. ఈ మేరకు వారితో 'నిరంతరం టచ్'లో ఉంటున్నట్లు ఆ దేశ ఉన్నత సైన్యాధికారి వెల్లడించారు.

afghan taliban
afghan taliban

దేశ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా తాలిబన్లతో పాకిస్థాన్(Taliban Pakistan) నిరంతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్(Major General Babar Iftikhar) తెలిపారు. 'వారి ఉద్దేశాలు, లక్ష్యాలను అనుమానించేందుకు మాకు(పాకిస్థాన్​కు) ఎటువంటి కారణం కనబడలేదు. అందుకే వారితో నిరంతరం టచ్‌లో ఉన్నాం. తాలిబన్లు మా జాతీయ ప్రయోజనాలను కాపాడతారు' అని ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

"పాకిస్థాన్ సహా ఏ దేశానికి వ్యతిరేకంగానూ ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్​ భూభాగాన్ని ఉపయోగించమని, ముష్కర సంస్థలను అనుమతించబోమని తాలిబన్లు అనేక సందర్భాల్లో పునరుద్ఘాటించారు."

-మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్, పాక్ సైనిక ప్రతినిధి

మరోవైపు ఉగ్రవాదులు పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండా పాక్ అధికారులు, తాలిబన్ల మధ్య చర్చలు(Pak Afghan Peace Talks) జరిగినట్లు 'డాన్' వార్తాపత్రిక(DAWN Newspaper) ఓ కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ)(TTP in Pakistan) దాడులు పెరిగాయి. దీనిపై తాలిబన్లను నిందించేందుకు పాక్ అధికారులు సిద్ధంగా లేరు. సరిహద్దు ప్రాంతాలపై తాలిబన్లు ఇంకా పూర్తిస్థాయిలో పట్టు సాధించలేదని చెబుతూ.. వారి వైఖరిని సమర్థించుకుంటున్నారు.

"సరిహద్దులను మెరుగ్గా నిర్వహించడమే మా లక్ష్యం. ఈ ప్రాంతంలో నెలకొన్న భిన్న పరిస్థితుల కారణంగా సరిహద్దులో కంచె నిర్మించడం ముఖ్యం. ఇబ్బందులు ఉన్నప్పటికీ.. 90 శాతం ఫెన్సింగ్​ను పాక్ పూర్తి చేసింది. ప్రస్తుతం సరిహద్దు నిర్వహణ మెరుగుపడుతోంది. భవిష్యత్తులో ఇది పూర్తి భద్రంగా ఉంటుందని ఆశిస్తున్నాం."

-మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్, సైనిక ప్రతినిధి

పాక్-అఫ్గాన్​ మధ్య ఉన్న 2,600 కి.మీ సరిహద్దులో కంచె(Afghan Pakistan Border Fence) నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నట్లు ఇఫ్తికార్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.