ETV Bharat / international

గేమ్​ ఆడుతూ 'ఐస్​క్రీం' ఆర్డర్​- రూ.లక్ష బిల్లు చూసి తండ్రికి షాక్!

author img

By

Published : Dec 15, 2021, 5:35 PM IST

గేమ్​ ఆడుతూ ఆన్​లైన్​లో ఓ ఫుడ్​ ఆర్డర్ పెట్టాడు ఐదేళ్ల కుర్రాడు. ఇందుకోసం తండ్రికి తెలియకుండా.. క్రెడిట్​ కార్డు వాడాడు. ఆర్డర్​ డెలివరీ సమయంలో బిల్లు చూసిన పిల్లాడి తండ్రికి చచ్చినంత పనైంది. ఏకంగా 1200 డాలర్లు(రూ. 91 వేలకుపైనే) బిల్లు వచ్చింది మరీ. అసలేమైందంటే..?

Sydney-kid-rakes-1200-ice-cream-bill
Sydney-kid-rakes-1200-ice-cream-bill

మొబైల్​ ఫోన్​లో గేమ్​ ఆడుతూ.. తండ్రి డబ్బులు గుల్ల చేశాడు ఓ ఐదేళ్ల కుర్రాడు. క్రెడిట్​ కార్డు నుంచి ఏకంగా 1200 డాలర్లు(రూ. 91 వేలకుపైనే) పోగొట్టాడు.

వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఐదేళ్ల బాలుడు టెట్రిస్​ అనే గేమ్​ ఆడుతుండగా.. అది ఊబర్​ ఈట్స్​ అనే వెబ్​సైట్​కు వెళ్లింది. అంతే నోరూరించే ఐస్​క్రీంలు అతడి కంట పడ్డాయి. వెంటనే ఆర్డర్​ పెట్టేశాడు. ఆర్డర్​ డెలివరీ అయినట్లుగా ఊబర్​ ఈట్స్​ నుంచి వచ్చిన మెసేజ్​ చూసిన తండ్రి షాకయ్యాడు. అప్పటివరకు అతడికి ఇదేం తెలియదు.

Sydney-kid-rakes-1200-ice-cream-bill
ఐదేళ్ల కుర్రాడు ఆర్డర్​ చేసిన కేక్​లు

ఆ పిల్లాడు.. ఫుడ్​ డెలివరీ కోసం తండ్రి పనిచేసే ప్రదేశం అడ్రస్​ ఇవ్వడం గమనార్హం. అప్పుడు బిల్లు చూసి ఆ తండ్రికి చచ్చినంత పనైంది. 1200 డాలర్ల ఖరీదు చేసే మెస్సినా ఫ్లేవర్​ ఐస్​క్రీంలు, 7 పెద్ద పెద్ద కేక్​లు, బ్యాగ్​ల నిండా తియ్యటి పదార్థాలు అందులో ఉన్నాయి.

Sydney-kid-rakes-1200-ice-cream-bill
పెద్ద పెద్ద కేక్​ బాక్స్​లు

ఐదేళ్ల కొడుకు చేసిన పనికి ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాడు.

ఈ విషయాన్నంతా.. మెస్సినానే సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం గమనార్హం. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Sydney-kid-rakes-1200-ice-cream-bill
ఆర్డర్ డెలివరీ చేసిన సంస్థ

ఇవీ చూడండి: ఆన్‌లైన్‌లో డబ్బు పోగొట్టి.. అమ్మ తిట్టిందని ఆత్మహత్య!

ఆన్​​లైన్ గేమ్​ ఆడుతూ లవ్- రాష్ట్రాలు దాటొచ్చి పెళ్లాడినా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.