ETV Bharat / international

స్పెయిన్​లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Oct 22, 2020, 8:57 PM IST

Spain reaches 1 million confirmed COVID-19 cases
స్పెయిన్​లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వంసానికి దేశాలు కుదేలవుతున్నాయి. ఒకటికన్నా ఎక్కువ సార్లు వైరస్ దండెత్తుతోంది. పలు దేశాలు మళ్లీ లాక్​డౌన్ బాటపడుతున్నాయి. అన్నిదేశాల్లో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 16 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 11.37 లక్షలకు చేరింది.

ప్రపంచంపై కరోనా మహమ్మారి విధ్వంసం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4.16 కోట్లకు చేరువైంది. బుధవారం నుంచి గురువారం ఉదయం మధ్య ఏకంగా 4లక్షల 38వేల 615 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 11 లక్షల 37 వేలకు చేరింది.

మొత్తం కేసులు: 4,15,99,040

మరణాలు: 11,37,974

కోలుకున్నవారు: 3,09,68,400

స్పెయిన్​లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. ఐరోపాలో పది లక్షల కేసులు నమోదైన తొలి దేశంగా నిలిచింది. ఒకప్పుడు ఐరోపాలో కరోనాకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ దేశంలో.. మరణాల సంఖ్య 34 వేలకు చేరింది.

ఉల్లంఘిస్తే అంతే

ఇస్లామాబాద్, కరాచీ సహా పాకిస్థాన్​లోని ప్రధాన నగరాల్లో కరోనా అత్యంత తీవ్రంగా ఉందని ప్రధాని ఇమ్రాన్​ ప్రత్యేక సహాయక అధికారి అయిన ఫైజల్ సుల్తాన్ పేర్కొన్నారు. ఈ నగరాల్లో పరిస్థితి మరింత దిగజారుతోందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రజలు లెక్కచేయకపోతే ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

పాక్​లో 24 గంటల వ్యవధిలో 736 మంది కరోనా బారిన పడ్డారు. గురువారం నాటికి దేశంలో కేసుల సంఖ్య 325,480కి చేరింది.

లాక్​డౌన్

కరోనా నియంత్రణకు చెక్ రిపబ్లిక్ మళ్లీ లాక్​డౌన్ బాట పట్టింది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలు చేసింది. లాక్​డౌన్ మళ్లీ విధించేది లేదని ఆ దేశ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్ చాలా సార్లు పేర్కొన్నారు. అయితే కేసుల పెరుగుదల వల్ల దేశంలోని వైద్య వ్యవస్థ తేలిపోయింది. ఫలితంగా ఆంక్షలు విధించక తప్పలేదని, ఈ చర్యలు తీసుకోకపోతే వైద్య వ్యవస్థ నవంబర్ 11లోపు కుప్పకూలిపోతుందని బాబిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను ఊహించలేదని.. లాక్​డౌన్ విధించినందుకు క్షమించాలని ప్రజలను కోరారు.

చెక్ రిపబ్లిక్​లో ఇప్పటివరకు 2,08,915 కేసులు నమోదయ్యాయి. 1,739 మంది మరణించారు. మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు గత వారం రోజుల వ్యవధిలోనే వెలుగులోకి వచ్చాయి.

జర్మనీ

జర్మనీలో మరో 11,287 వేల కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 10 వేలకు పైగా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇటీవలే ఆ దేశ వైద్య శాఖ మంత్రి జెన్స్ స్పాహ్న్ కరోనా బారిన పడ్డారు.

1.5 లక్షలకు చేరువ

నేపాల్​లో కరోనా కేసుల సంఖ్య 1లక్షా 48వేల 509కి చేరింది. గురువారం 3,637 కేసులు వెలుగుచూశాయి. 21 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 812కి చేరింది.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశంకేసులుమరణాలు
అమెరికా85,84,8192,27,409
బ్రెజిల్53,00,6491,55,459
రష్యా14,47,33524,952
స్పెయిన్10,46,64134,366
అర్జెంటీనా10,37,32527,519
కొలంబియా9,81,70029,464
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.