ETV Bharat / international

No mask: ఒక్కడోసు తీసుకున్నా మాస్కు అక్కర్లేదు!

author img

By

Published : May 27, 2021, 8:10 AM IST

south korea
మాస్క్, దక్షిణ కొరియా

కొవిడ్‌ వ్యాక్సిన్‌(vaccine) తీసుకున్నవారు మాస్కులు లేకుండానే తిరిగేందుకు అమెరికా ప్రభుత్వం (us govt) అనుమతించింది. ఇదే జాబితాలో చేరేందుకు తాజాగా దక్షిణ కొరియా సైతం ఊవ్విళ్లూరుతోంది.

మాస్కులు నిత్యజీవితంలో భాగమై పోయాయి. ఇప్పుడంతా మాస్కులు(masks) లేకుండా స్వేచ్ఛగా తిరిగే రోజుల కోసం వేచిచూస్తున్నారు. కానీ, మహమ్మారి (pandemic) అంతమయ్యే వరకు మాస్కులు లేకుంటే ప్రమాదం పక్కనున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, అత్యధిక మందికి టీకాలు అందజేసిన అమెరికా(america)లో మాత్రం పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు మాస్కులు లేకుండానే తిరిగేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఇదే జాబితాలో చేరేందుకు తాజాగా దక్షిణ కొరియా(korea) సైతం ఊవ్విళ్లూరుతోంది.

కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. జులై నుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రధాని కిమ్‌ బూ క్యుమ్‌ ప్రకటించారు. అక్టోబర్ నాటికి 70 శాతం మందికి టీకాలు అందుతాయని.. అప్పటి నుంచి క్వారంటైన్‌ నిబంధనల్ని సైతం సవరిస్తామని వెల్లడించారు. 60-74 ఏళ్ల మధ్య వయసు వారిలో 60 శాతం మంది ఇప్పటికే వ్యాక్సిన్ల(vaccine) కోసం రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు.

70 శాతం మందికి వ్యాక్సిన్​!

దక్షిణ కొరియా జనాభా 5.2 కోట్లు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 7.7 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సెప్టెంబరు నాటికి కనీసం 70 శాతం మందికి టీకాలు అందించాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికే మాస్కు నిబంధనను సడలించేందుకు సిద్ధమైంది. గురువారం నుంచి అక్కడ 65-74 ఏళ్ల మధ్య వయసు గల సామాన్య ప్రజలకు టీకాలు అందించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దేశంలో ఇప్పటి వరకు 1,37,682 మంది మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 1,940 మంది మృత్యువాతపడ్డారు.

ఇదీ చదవండి:కొవిడ్ 'ల్యాబ్ లీక్'​పై చైనా స్వతంత్ర దర్యాప్తు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.