ETV Bharat / international

ఇక ఆ దేశంలో మాస్క్ ధరించడం తప్పనిసరి!

author img

By

Published : Oct 27, 2020, 7:21 PM IST

ప్రపంచ దేశాలు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 4 కోట్ల 38 లక్షల 84 వేలమందికి పైగా కరోనా​ బారిన పడ్డారు. 11 లక్షల 66 వేల మందికి పైగా కొవిడ్​తో మృతి చెందారు. రష్యా,ఇరాక్, మెక్సికో, పోలాండ్​​ దేశాల్లో కొవిడ్​ తీవ్ర ప్రభావం చూపుతోంది.

Russia issues nationwide mask requirement
రష్యాలో కరోనా విజృంభణ- మాస్క్​ ధరించాలని ఆదేశం

ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 84 వేలకు చేరింది. మృతుల సంఖ్య 11 లక్షల 66 వేల 240కి పెరిగింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి.

రష్యాలో వైరస్​ వేగంగా వ్యాపిస్తున్న వేళ... ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. దేశంలో ఒక్కరోజే 16,550 మంది వైరస్​ బారిన పడగా... 320 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • పోలాండ్​లో ఒక్కరోజే 16,300 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 132మంది చనిపోయారు.
  • బెల్జియంలో తాజాగా 12,687 కేసులు వెలుగుచూశాయి. మరో 89మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇరాన్​లో కొత్తగా 6,968 కేసులు నమోదవగా.. 346 మంది మరణించారు.
  • ఉక్రెయిన్​లో 6,677 కేసులు బయటపడగా.. 126 మంది మృతి చెందారు.
  • ఇండోనేషియాలో తాజాగా 3,250 మందికి వైరస్​ సోకింది. 101 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మెక్సికోలో కొత్తగా 247 మంది మరణించగా.. 4,166 మంది వైరస్​ బారిన పడ్డారు.
  • చైనాలో కొత్తగా 26 మంది లక్షణాలు లేకుండా వైరస్​ బారిన పడ్డారు.
  • సింగపూర్​లో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గినట్లే కనిపిస్తోంది. కొత్తగా కేవలం ఏడు కేసులే బయటపడ్డాయి.
  • శ్రీలంకలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ... సామాజిక వ్యాప్తి లేదని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇదీ చూడండి: 'పాంపియో.. మా మధ్య విభేదాలు తేవొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.