ETV Bharat / international

భారత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ఇమ్రాన్‌

author img

By

Published : Apr 25, 2021, 5:37 AM IST

Updated : Apr 25, 2021, 6:36 AM IST

pakistan pm
పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్

కొవిడ్ రెండో దశ విజృంభణపై పోరాటం చేస్తున్న భారత ప్రజల పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ సంఘీభావం వ్యక్తం చేశారు. మహమ్మారితో పోరాడుతున్న అన్ని దేశాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సవాలుపై కలసికట్టుగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతిపై పోరాటం చేస్తున్న భారత ప్రజల పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంఘీభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహమ్మారితో పోరాడుతున్న అన్ని దేశాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

''కరోనా వైరస్‌ రెండో దశపై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. పొరుగుదేశం సహా ఇతర అన్ని దేశాలు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సవాలుపై కలసికట్టుగా యుద్ధం చేయాలి''

- ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని

భారత్‌లో కరోనా వైరస్‌ రెండోదశ కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది మంది కొత్తగా వైరస్ బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 1,89,544 మంది ప్రాణాలు వదిలారు. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల అధినేతలు భారత్‌ పట్ల సంఘీభావం ప్రకటించారు. భారత్‌కు ఏవిధంగానైనా సాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి.

ఇదీ చదవండి : మహిళలూ.. అది ఫేక్‌న్యూస్‌!

Last Updated :Apr 25, 2021, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.