ETV Bharat / international

అమెరికా పర్యటనలో... పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​

author img

By

Published : Jul 21, 2019, 5:13 AM IST

అమెరికా పర్యటనలో....పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ శనివారం అమెరికాకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో సమావేశమవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ అంశంతో పాటు పాక్​కు సైనిక సహాయం అందించాలని ట్రంప్​ను కోరనున్నారు ఇమ్రాన్.

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆహ్వానం మేరకు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ ​ శనివారం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. సోమవారం ఆయన అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే ధ్యేయంగా ఇద్దరు నేతలు చర్చలు జరుపనున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకు ముందు పాకిస్థాన్​పై బహిరంగ విమర్శలు చేశారు. పాక్...​ అమెరికాకు అబద్ధాలు చెప్పి, మోసానికి పాల్పడింది తప్ప ఏ మేలు చేయలేదని ఆరోపించారు. పాక్​కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఉగ్రవాద నిర్మూలనకు మరింత కృషిచేయాలని హెచ్చరించారు. ఈ కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్​ఖాన్​ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఘనస్వాగతం..

పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​తో పాటు ఆ దేశ ఆర్మీ చీఫ్​ జనరల్ కమర్​ జావేద్ బజ్వా, ఐఎస్​ఐ చీఫ్​ లెఫ్టినెంట్ జనరల్ ఫయేజ్​ హమీద్​ కూడా మూడు రోజుల అమెరికా పర్యటన కోసం వెళ్లారు. వీరంతా ఖతార్​ ఎయిర్​వేస్​కి చెందిన ఓ వాణిజ్య​ విమానంలో అమెరికాకు చేరుకున్నారు. ఇమ్రాన్​ఖాన్​కు.. విదేశాంగమంత్రి షా మొహమూద్​ ఖురేషీతో పాటు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్థానీ​ అమెరికన్లు స్వాగతం పలికారు.

ప్రభుత్వ ఖర్చులు తగ్గించే అంశంలో భాగంగా ఇమ్రాన్​ఖాన్​ పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్​ఖాన్ అధికారిక నివాసంలో బస చేస్తారు.

ట్రంప్​తో భేటీ..

సోమవారం శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్​తో జరిగే సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు ఇమ్రాన్.

ఈ భేటీలో ఆఫ్ఘనిస్థాన్​తో శాంతి చర్చలు, ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్​ తీసుకుంటున్న చర్యలను ట్రంప్​నకు వివరించనున్నారు ఇమ్రాన్​. సైనిక (ఆర్థిక) సహాయం పునరుద్ధరణ అంశాన్నీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు . భారత్​తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గేలా పాక్​ తీసుకున్న చర్యలనూ వివరించే అవకాశం ఉందని సమాచారం.

జూలై 23న తిరుగుప్రయాణం లోపు అమెరికా హౌస్ స్పీకర్​ నాన్సీ పెలోసీతోనూ ఇమ్రాన్​ఖాన్​ సమావేశమవుతారు.

ఉగ్రవాదులపై చర్యలు

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా చర్యలు చేపట్టింది. జమాత్​ ఉద్​ దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్​ సయీద్​పై కేసులు నమోదు చేసింది. ఆఫ్ఘనిస్థాన్​తో శాంతి చర్చలకు కృషి చేస్తోంది. భారత్​, అమెరికా ఆందోళనలను శాంతింపజేయడానికే ఇమ్రాన్​ఖాన్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది.

సౌదీ యువరాజు చొరవతోనే...

ట్రంప్​, ఇమ్రాన్​ఖాన్​ల సమావేశం ఏర్పాటుచేయడంలో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్​ సల్మాన్​ కీలకపాత్ర పోషించారని ఎక్స్​ప్రెస్ ట్రిబ్యూన్​ పేర్కొంది. సౌదీ యువరాజుకు.. ట్రంప్​ అల్లుడు కుష్నర్​తో ఉన్న వ్యక్తిగత స్నేహాన్ని ఉపయోగించి.. ఈ ఇరువురు నేతల భేటీకి ఏర్పాటు చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.

ఇదీ చూడండి: ఫ్లోరిడాలో సంగీతంతో భయపెడుతున్న బీచ్​ అధికారులు

SNTV Digital Daily Planning Update, 1830 GMT
Saturday 20th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Arsenal v Fiorentina in ICC match in North Carolina. Expect at 0030.
SOCCER: Benfica v Chivas de Guadalajara in ICC friendly in California. Expect at 2300.
GOLF: Action from round three of The Open. Expect at 2000.
GOLF: Further reaction from round three of The Open. Updates to follow.
SOCCER: Algeria arrive home after AFCON glory. Already moved.  
SOCCER: Hazard trains with Real on eve of Bayern pre-season friendly. Already moved.  
SOCCER: 'My first goal was like an aeroplane strike' says Ibrahimovic after hat-trick in the Los Angeles derby. Already moved.
SOCCER: Zidane roulette skill pulled off by Man United's Greenwood. Already moved.
SOCCER: Paris police clash with Algeria fans after team beat Senegal to win AFCON. Already moved.  
CYCLING: Sagan congratulated by President Macron after another wheelie finish. Already moved.
ATHLETICS: GB's Sayers awarded retrospective 2008 Olympic bronze medal. Already moved.  
VIRAL (SOCCER): Klopp hugged by reporter after defeat to Borussia Dortmund. Already moved.  
VIRAL (SOCCER): Carrasco scores directly from corner kick for Dalian Yifang. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Sunday 21st July 2019.
SOCCER: Bayern Munich v Real Madrid, NRG Stadium, Houston, Texas, USA.
SOCCER: Reaction following Bayern Munich v Real Madrid, NRG Stadium, Houston, Texas, USA.  
SOCCER: Chelsea training session and mixed zone in Omiya, Japan.
SOCCER: Chelsea and Barcelona attend Rakuten Cup Reception Party at Intercontinental Hotel.
SOCCER: Juventus v Tottenham Hotspur in the International Champions Cup in Singapore.
SOCCER: Post-match reaction after Juventus v Tottenham Hotspur in the International Champions Cup in Singapore.
SOCCER: Chongqing FC v Shanghai SIPG in the Chinese Super League.
SOCCER: Jiangsu Suning v Beijing Guoan in the Chinese Super League.
GOLF: Highlights from the final round of the Open Championship in Royal Portrush Golf Club, Northern Ireland.
GOLF: Reaction following the final round of the 148th Open Championship in Royal Portrush Golf Club, Northern Ireland.
GOLF (LPGA): Dow Great Lakes Bay Invitational, Midland Country Club, Midland, Michigan, USA.
TENNIS: Highlights from the WTA, Bucharest Open final, Bucharest, Romania.
CYCLING: Highlights from stage 15 of the Tour de France, Limoux - Foix Prat d'Albis.
ATHLETICS: Highlights from the IAAF Diamond League in London, day two.
BADMINTON: Finals of the BWF Indonesia Open from Jakarta, Indonesia,
MOTORSPORT (IRL): Iowa 300, Iowa Speedway, Newton, Iowa, USA.
MOTORSPORT: Highlights from DTM race two in Assen, Netherlands.
MOTORSPORT: Highlights from the FIM Speedway of Nations Final two in Togliatti, Russia.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.