ETV Bharat / international

గురునానక్ జయంతి ఉత్సవాలకు 600 మంది సిక్కులు

author img

By

Published : Nov 28, 2020, 5:53 AM IST

Updated : Nov 28, 2020, 6:37 AM IST

Over 600 Indian Sikh pilgrims arrive in Pak for Guru Nanak Dev's 551st birth anniversary
గురునానక్ జయంత్యుత్సవాలకు 600 మంది భారతీయ సిక్కులు

సిక్కు మత గురువు గురనానక్ 551వ జయంతి ఉత్సవాల సందర్భంగా దాదాపు 600 మంది భారతీయ సిక్కులు పాకిస్థాన్​ చేరుకున్నారు. వాఘా సరిహద్దు ద్వారా యాత్రికులు తమ ప్రాంతానికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు.

శుక్రవారం దాదాపు 600 మంది భారతీయ సిక్కులు వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్​ చేరుకున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 551వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారతీయులు పాక్​కు ప్రయాణమయ్యారు.

నవంబర్​ 30న పాకిస్థాన్​ పంజాబ్​ ప్రాంతంలోని గురుద్వారా జన్మస్థానమైన​ నన్​కానా సాహిబ్ వద్ద ఈ జయంతి వేడుకలు జరగనున్నాయి.

" మొత్తంగా 602 మంది భారతీయ సిక్కులు పాకిస్థాన్​ చేరుకున్నారు. 10 రోజుల పాటు వారు నంకానా సాహిబ్​ ప్రాంతంలోని ఇతర గురుద్వారాలను కూడా సందర్శించనున్నారు. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) ఛైర్మన్ డా. అమీర్ అమ్మద్ సూచనల మేరకు యాత్రికుల కోసం ప్రత్యేక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు".

-అసిఫ్ హష్మి, ఈటీపీబీ ప్రతినిధి.

పంజాబ్​ ఆరోగ్య శాఖ సిబ్బంది యాత్రికుల కొవిడ్​-19 పరీక్ష ఫలితాలను పరిశీలించారని హష్మి తెలిపారు. ప్రతి ఏటా దాదాపు 2000 మంది భారతీయ సిక్కులు పాకిస్థాన్​ వెళ్లేవారు కానీ ఈ ఏడాది కరోనా కారణంగా ఈ సంఖ్య చాలా మేరకు తగ్గింది.

ఇదీ చదవండి:బ్రిటన్ ప్రధాని బోరిస్​తో మోదీ సంభాషణ

Last Updated :Nov 28, 2020, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.