ETV Bharat / international

నాలుగేళ్ల బాలిక అదృశ్యంపై ఆ దేశంలో యుద్ధవాతావరణం.. చివరకు...

author img

By

Published : Nov 3, 2021, 2:01 PM IST

australia girl missing cleo
బాలిక అదృశ్యం

నాలుగేళ్ల ఆ చిన్నారి (australia little girl missing) ఆచూకీ కోసం హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సముద్ర తీర ప్రాంతాల్లో శోధనకు నౌకలు దూసుకుపోయాయి. భారీ సంఖ్యలో పోలీసు బృందాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ఆ చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని (missing girl australia 2021) ఓ దేశం ప్రార్థన చేసింది. ఇంతకీ ఎవరా పాప? ఏం జరిగింది ఆ చిన్నారికి?.

అది ఆస్ట్రేలియాలోని (australia little girl missing) క్యూబా బ్లూహోల్స్‌ పర్యటక ప్రాంతం. ఎల్లీ స్మిత్, ఆమె భర్త జేక్‌ గిడ్డన్‌, వారి నాలుగేళ్ల గారాలపట్టి క్లియో స్మిత్‌తో కలిసి వారాంతాన్ని గడిపేందుకు అక్కడకు వెళ్లారు. సముద్ర తీరాన అడవికి దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలో రాత్రంతా బస చేశారు. తెల్లారి నిద్ర లేచి చూసే సరికి తమ (missing girl australia cleo) చిన్నారి క్లియో స్మిత్‌ కనపడలేదు. తప్పిపోయిందో, ఎవరైనా కిడ్నాప్‌ చేశారో కూడా తెలియదు. పరిసరాలను గాలించిన ఆ తల్లిదండ్రులు ఎంతకీ ఆచూకీ లేకపోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

australia girl missing cleo
నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్​

కమ్‌బ్యాక్‌ క్లియో..

క్లియో స్మిత్‌ ఆచూకీ కోసం పోలీసులు, వలంటీర్లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. దాదాపు మూడు వారాలు గడిచినా బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు. పాపా ఆచూకీ తెలిపితే 1 మిలియన్‌ డాలర్లు అందజేస్తామని (missing girl australia 2021) ప్రభుత్వం ప్రకటించింది. తమ చిన్నారిని రక్షించాలంటూ చిన్నారి తల్లీ ఎల్లీ స్మిత్ చేసిన బహిరంగ అభ్యర్థన ఆస్ట్రేలియాను కదిలించింది. చిన్నారి తిరిగి రావాలని దేశం మొత్తం ప్రార్థించింది. కమ్‌బ్యాక్‌ క్లియో అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పోస్టులు పెట్టారు.

australia girl missing cleo
బాలిక ఆచూకి కోసం వెలసిన బ్యానర్లు

ఫలించిన ఆపరేషన్

క్లియో స్మిత్‌ ఆచూకీపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ 18 రోజుల తర్వాత అత్యాధునిక సాంకేతికత సాయంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ ఫలించింది. క్లియో స్మిత్‌ను కిడ్నాప్‌ చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. వెంటనే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి తీర ప్రాంత పట్టణమైన కార్నార్వోన్‌లోని ఓ తాళం వేసిన ఇంట్లో చిన్నారిని గుర్తించారు పోలీసులు. బాలికను కిడ్నాప్‌ (missing girl australia parents) చేసినట్లుగా భావిస్తున్న అనుమానితుడిని అరెస్ట్‌ చేశారు. బాలికకు ఏమి జరిగిందనే దానిపై అధికారులు ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. చిన్నారి తిరిగి తమ వద్దకు చేరాక తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

australia girl missing cleo
క్లియో స్మిత్‌ తల్లిదండ్రులు

ప్రధాని పర్యవేక్షణలో..

చిన్నారి ఆచూకీ కోసం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ను ఆస్ట్రేలియా ప్రధాని స్టాట్‌ మారిసన్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మన ప్రార్థనలు ఫలించాయని, చిన్నారి సురక్షితంగా ఉందని మారిసన్‌ ప్రకటించారు. బాలిక ఆచూకీ కోసం మానవ మేధస్సు, సాంకేతికత, సీసీ ఫుటేజ్, ఫోరెన్సిక్ విశ్లేషణలు ఉపయోగపడ్డాయని తెలిపారు. తాము ఎప్పుడూ ఆశ కోల్పోలేదని, కాపాడిన తర్వాత చిన్నారి నవ్వును చూడడం అద్భుత సన్నివేశమని పోలీస్ కమిషనర్ క్రిస్ డాసన్ అన్నారు.

ఇదీ చదవండి:కాప్​ సదస్సులో బైడెన్ కునుకు..! వీడియో వైరల్​

Australia Submarine Deal: 'ఆస్ట్రేలియా ప్రధాని అబద్ధాలు చెప్పారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.