ETV Bharat / international

ఇరాన్ అణు కర్మాగారంపై సైబర్ దాడి!

author img

By

Published : Apr 12, 2021, 5:11 AM IST

ఇరాన్​లో అణు కర్మాగారంపై సైబర్​ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ పనేనని ఆ దేశ మీడియా పేర్కొంది. నతాంజ్‌లోని అణు కర్మాగారంలో యంత్రాన్ని పనిచేయించడం మెుదలుపెట్టిన కొద్ది గంటలకే అనూహ్యంగా అక్కడ విద్యుత్‌ పంపిణీ కుప్పకూలింది.

Iran calls Natanz atomic site blackout ''nuclear terrorism''
ఇరాన్ అణు కర్మాగారంపై సైబర్ దాడి!

యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు ఇరాన్‌ ప్రారంభించిన ఆధునాతన న్యూక్లియర్‌ సెంట్రిఫ్యూజ్‌ ఐర్‌-9 సైబర్‌ దాడికి గురైనట్లు తెలుస్తోంది. నతాంజ్‌లోని అణు కర్మాగారంలో యంత్రాన్ని పనిచేయించడం మెుదలుపెట్టిన కొద్ది గంటలకే అనూహ్యంగా అక్కడ విద్యుత్‌ పంపిణీ కుప్పకూలడాన్ని ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడిగా అక్కడి మీడియా పేర్కొంది.

అణు కర్మాగారంలో విద్యుత్‌ సమస్య వల్ల నేలపై ఉన్న వర్క్‌షాప్‌లు, నేల మాళిగలోని అణుశుద్ధి యూనిట్లు సహా.. కర్మాగారం అంతటా విద్యుత్‌ నిలిచిపోయిందని ఇరాన్‌ అణు విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. విద్యుత్‌ నిలిచిపోవటం చాలా అనుమానస్పదంగా ఉందని ఇరాన్‌ పార్లమెంటులోని ఇంధన కమిటీ అధికార ప్రతినిధి మాలెక్‌ షిరియాతి నియాసర్ అన్నారు. ఇది విద్రోహచర్య, చొరబాటును సూచిస్తోందని చెప్పారు.

విద్యుత్‌ నిలిచిపోవటం వెనుక ఇజ్రాయెల్‌ ప్రమేయముండొచ్చని ఆ దేశ అధికారిక మీడియా కాన్‌ సహా పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: 'సరిహద్దు పరిస్థితులను చూసి భారత్​ సంతోషించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.