ETV Bharat / international

కొత్త ట్విస్ట్​.. చైనా-పాక్​తో కలిసి భారత యుద్ధ విన్యాసాలు!

author img

By

Published : Sep 13, 2021, 3:43 PM IST

Indian military contingent in Russia
భారత సైన్యం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రష్యాలో జరగనున్న యుద్ధ విన్యాసాల్లో భారత్​ భాగం కానుంది. ఇదే కార్యక్రమంలో చైనా-పాక్ కూడా పాల్గొననున్నాయి(india china border news).

షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ)​ పీస్​ మిషన్​లో భాగంగా రష్యాలో జరగనున్న ఉగ్రవాద నిరోధక యుద్ధ విన్యాసాల్లో భారత్​ పాల్గొననుంది. ఇదే కార్యక్రమంలో చైనా-పాకిస్థాన్​ కూడా పాలుపంచుకోనున్నాయి(india china relations). ఆయా దేశాలతో భారత్​కు గత కొంత కాలంగా విభేదాలు నెలకొన్న తరుణంలో రష్యాలో జరగనున్న కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది.

విన్యాసాలు ఈ వారంలో ప్రారంభమై.. ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. దేశం తరఫున ఉన్నతస్థాయి సైనిక, వాయుసేన దళాలు రష్యాకు వెళ్లనున్నాయి. వాస్తవానికి ఈ విన్యాసాలు గతేడాది కూడా జరగ్గా.. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తప్పుకుంది భారత్(india china border news)​.

సరిహద్దు ఉద్రిక్తతలతో పాటు తాజాగా ఏర్పడిన అఫ్గాన్​ సంక్షోభంపైనా చైనా-పాక్​, భారత్​ మధ్య విభేదాలున్నాయి(india pak relations). తాలిబన్ల ప్రభుత్వానికి ఆ దేశాలు మద్దతిస్తుండగా.. భారత్​ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.

భారత బృందంలో కొందరు.. ఇప్పటికే రష్యాలో జరుగుతున్న జాపద్​-21 విన్యాసాలకు హాజరయ్యారు. ఇందులో చైనా-పాక్​ పరిశీలకులుగా ఉన్నాయి.

ఇదీ చూడండి:- ఉగ్రవాదం నిర్మూలనకు 'షాంఘై' దేశాల తీర్మానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.