ETV Bharat / international

'అణు' వివరాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్- పాక్​

author img

By

Published : Jan 1, 2022, 4:21 PM IST

India Pakistan Nuclear Exchange: భారత్‌, పాకిస్థాన్​ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. దౌత్య మార్గాల్లో దిల్లీ, ఇస్లామాబాద్​లో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. దీంతోపాటు ఖైదీల వివరాలను కూడా భారత్​, పాక్ పరస్పరం అందజేసుకున్నాయి.

India, Pakistan nuclear exchange, india pakistan prisoners
భారత్, పాక్ అణు స్థావరాల

India Pakistan Nuclear Exchange: 31 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత్‌, పాకిస్థాన్​ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదు అనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ద్వైపాక్షిక మార్గంలో ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది.

"భారత్, పాకిస్థాన్​ దౌత్యమార్గాల ద్వారా.. దిల్లీ, ఇస్లామాబాద్ తమ అణుస్థావరాల జాబితాను పంచుకున్నాయి. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తైంది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 31వ సారి."

-భారత విదేశాంగ శాఖ

అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన 'అటాక్స్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఇన్స్​టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్' ప్రకారం ఈ వివరాలను పరస్పరం అందజేసుకున్నాయి. 1988 డిసెంబర్ 31న ఈ ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ సంతకం చేశాయి. ఏటా అణు స్థావరాల సమాచారం అందించుకోవాలని ఇందులోని ఆర్టికల్-2 నిబంధన స్పష్టం చేస్తుంది. ఈ ప్రకారం 1992 జనవరి 1 నుంచి ప్రతి సంవత్సరం ఇరుదేశాలు అణు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.

ఖైదీల వివరాలు సైతం

India pakistan prisoners: అణు స్థావరాలతో పాటు పాక్​లో ఉన్న భారతీయ ఖైదీల వివరాలు, భారత్​లో ఉన్న పాక్ ఖైదీల వివరాలను ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. పాక్ కస్టడీలో ఉన్న భారత్​కు చెందిన 356 మంది మత్స్యకారులు, ఇద్దరు పౌరులను తిరిగి స్వదేశానికి పంపాలని పాకిస్థాన్​ను భారత్​ కోరింది. అంతేగాకుండా 182 మంది మత్స్యకారులు, 17 మంది పౌరులకు తక్షణమే 'కాన్సులర్ యాక్సిస్' అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ తెలిపింది.

భారత్​ కస్టడీలో ఉన్న 282 మంది పాకిస్థాన్ పౌరులు, 73 మంది మత్స్యకారుల వివరాలను పాకిస్థాన్​కు భారత విదేశాంగ శాఖ అదించింది. అదే సమయంలో పాక్ చెరలో ఉన్న 51 మంది పౌరులు, 577 మంది మత్స్యకారులను పాకిస్థాన్ విదేశాంగ శాఖ.. భారత్​కు అందించింది.

2008 మే 21న ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శనివారం ఈ సమాచార మార్పిడి జరిగింది. ఒప్పందం ప్రకారం రెండుసార్లు(జనవరి 1న, జులై 1న) ఖైదీల వివరాలను ఇచ్చిపుచ్చుకోవాలి.

చైనాతో కలిసి పాక్​..

China pakistan nuclear cooperation: మరోవైపు... పాకిస్థాన్​, చైనాతో కలిసి అణుకార్యకలాపాల్లో జోరు ప్రదర్శిస్తోంది. మూడు దశాబ్దాల 'ఆల్​-వెదర్ కూటమి'లో భాగంగా.. చైనా సాయంతో కరాచీలో నెలకొల్పిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్​-3లో ఇంధనం నింపే ప్రక్రియను పాకిస్థాన్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థ తెలిపింది.

పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ అధికారిక అనుమతి లభించాక.. ఈ 1,100 మెగా వాట్ల న్యూక్లియర్ ప్రాజెక్టులో రెండోసారి ఇంధనం నింపే ప్రక్రియ పూర్తి చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'సైనిక బలోపేతానికి కిమ్​ వ్యూహాలు..కొవిడ్​ చర్యలు మరింత కఠినతరం'

ఇదీ చూడండి: పుతిన్​కు బైడెన్​ స్ట్రాంగ్​ వార్నింగ్​- అదే జరిగితే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.