ETV Bharat / international

తాలిబన్లకు ఆ మార్కెట్​ అండ- అందుకే అమెరికా ఆంక్షలు బేఖాతర్!

author img

By

Published : Sep 8, 2021, 5:59 PM IST

అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ అఫ్గాన్​పై(Afghanistan news) ఆంక్షలు విధించినా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా కాపాడే శక్తి ఓ మార్కెట్​కు ఉంది. ఈ విషయాన్ని పసిగట్టే రోజుకు రూ.వందల కోట్ల నగదు మార్పిడి, లావాదేవీలు జరిగే ఈ ప్రాంతాన్ని(sarai shahzada money exchange) తాలిబన్లు(Afghan Taliban) ఆగస్టు 15నే తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 1990లలో వారు అఫ్గాన్​ను పాలించినప్పుడు ప్రతి లావాదేవీ ఇక్కడి నుంచే జరిగేది. ఇప్పుడు అఫ్గాన్​కు అత్యంత కీలకంగా మారిన ఆ మార్కెట్ కథెంటో చూద్దాం.

index-economy-black-market-money-changers-keep-afghanistans-economy-alive
అమెరికా ఆంక్షలు విధించినా అఫ్గాన్​కు ఆ మార్కెట్ అండ!

అఫ్గానిస్థాన్​ను తాలబన్లు(Afghan Taliban) తమ నియంత్రణలోకి తెచ్చుకున్న అనతరం ఆ దేశానికి చెందిన 9.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలపై అమెరికా ఆంక్షలు విధించింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని(Taliban government) గుర్తించమని తెలిపింది. ఈ బాటలోనే దాని మిత్ర దేశాలు, ప్రపంచంలోని ఇతర దేశాలు నడుస్తున్నాయి. ఈ ఆంక్షలతో తలెత్తే ఆర్థిక సంక్షోభం తాలిబన్లకు పెద్ద సవాల్​గా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అయితే ప్రపంచదేశాలన్నీ అంక్షలు విధించినా అఫ్గాన్​కు ఓ మార్కెట్​ అండగా నిలవనుంది. కాబుల్​లో(sarai shahzada kabul afghanistan) ఉండే ఈ ప్రాంతంలో రోజుకు రూ.వందల కోట్ల నగదు మార్పిడి జరుగుతుంటుంది. ఎవరి చేతిలో చూసినా నోట్ల కట్టలే దర్శనిస్తుమింటాయి. సరాయ్ షహ్​జాదాగా(sarai shahzada money exchange) పిలిచే ఈ మార్కెటే అఫ్గాన్​లో నగదు మార్పిడికి కేంద్రం. ఇక్కడి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే న్యూయార్క్​ వాల్​స్ట్రీట్​లో వ్యాపారా లావాదేవీల్లా ఉంటుంది.

sarai shahzada money exchange
చేతినిండా డబ్బుల కట్టలతో ఓ వ్యాపారి
sarai shahzada money exchange
మార్కెట్​ ప్రాంతంలో రద్దీ, భద్రత ఏర్పాటు

అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లకు ఇప్పుడు ఆర్థిక మద్దతు అత్యవసరం. సంక్షోభం రాకుండా ముందుగానే ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆగస్టు 15న కాబుల్​లోకి మధ్యాహ్నం 3:00గం.లకు ప్రవేశించిన వారు.. 5:30గం.లకే సరాయ్ షహ్​జాదా మార్కెట్​పై పూర్తిగా పట్టు సాధించారంటే ఇది వారికి ఎంత కీలకమో ఆర్థమవుతుంది.

sarai shahzada money exchange
డబ్బులు లెక్కిస్తున్న వ్యాపారులు

అఫ్గాన్ ప్రభుత్వం ఖర్చు చేసే నిధుల్లో దాదాపు 75 శాతం విదేశాల నుంచి ఆర్థిక సాయంగా అందేవే. అయితే అఫ్గాన్ జాతీయ బ్యాంకు 'ద అఫ్గానిస్థాన్ బ్యాంకు' విదేశీ నిల్వలపై అమెరికా ఆంక్షలు విధించడం ఇబ్బందిగా మారింది. దీంతో రెండు శతాబ్దాలుగా అఫ్గాన్​ ఆర్థిక(Afghanistan economy) వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్న నగదు మార్పిడి సంస్థలే ఇప్పుడు.. మరోసారి ఆ దేశాన్ని కాపాడనున్నాయి.

sarai shahzada money exchange
సరాయ్ షహ్​జాదా మార్కెట్​

ఇక్కడ నగదు మార్పిడి జరపడాన్ని సరాఫ్, శితోస్​ అని పిలుస్తుంటారు. కస్టమర్ల నగదును భద్రపరచడమే గాక వారికి ఇతర సేవలను కూడా అందిస్తుంటారు. విదేశీ కరెన్సీ మార్పిడి, పొరుగు దేశాల నుంచి వస్తువుల సరఫరా వంటివి ఎంతో నమ్మకంగా జరుపుతుంటారు.

sarai shahzada money exchange
ఎవరి చేతిలో చూసినా డబ్బుల కట్టలే

వీరు అందించే సేవలు..

  1. రిటైల్ సేవింగ్ అకౌంట్​లో కస్టమర్ల డబ్బు భద్రపరచడం
  2. ఇతర దేశాలతో సరకుల వ్యాపారం జరపడానికి రుణాలు(క్రెడిట్ కార్డులు) ఇవ్వడం
  3. హవాలా రూపంలో లావాదేవీలు జరపడం

ఈ మార్కెట్​పై అఫ్గాన్ ప్రజలకు అత్యంత విశ్వాసం ఉండటానికి కారణం... మొదటి నుంచి అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోడమే. 1939లో ప్రభుత్వం ద అఫ్గానిస్థాన్​ బ్యాంకును స్థాపించినప్పటికీ దాని సేవలు కేవలం ప్రభుత్వ అధికారులకే పరిమితమయ్యాయి. 1970 నాటికి ఆరు బ్యాంకులే ఉన్నాయి. అప్గాన్​పై అమెరికా దాడుల తర్వాత పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమయంలో అఫ్గాన్ బ్యాంకింగ్ వ్యవస్థను 'భౌతికంగా నాశనం, సాంకేతికంగా పనికిరానిది'గా ప్రపంచ బ్యాంకు అభివర్ణించింది.

sarai shahzada money exchange
సరాయ్ షహ్​జాదా మార్కెట్లో రద్దీ
sarai shahzada money exchange
నగదు లావాదేవీలు చేస్తున్న వ్యాపారులు

తాలిబన్ల బ్యాంకు..

అఫ్గాన్​ను తొలిసారి 1996-2001 మధ్య పాలించిన తాలిబన్లుకు ఈ మార్కెట్ అత్యంత కీలకంగా ఉండేది. డబ్బుకు సంబంధించి ప్రతి లావాదేవీ ఇక్కడే జరిగేది. అమెరికా కాలుమోపక ముందు.. పశ్చిమ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థను ఇక్కడ పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి పరిమిత సేవలు అందించడం వల్ల బ్లాక్ మార్కెట్​లోనే ప్రజలు లావాదేవీలు జరిపేవారు.

2010లో అప్గాన్​లో బ్యాంకుల సంఖ్య 17కు చేరినప్పటికీ ప్రభుత్వ అధికారులు కుంభకోణాలు, అవినీతికి పాల్పడటం వల్ల ప్రజల్లో వాటిపై విశ్వాసం సన్నగిల్లింది. అందుకే ఇప్పటికీ నగదు మార్పిడి చేసే మనీ ఎక్స్ఛేంజర్స్​కే ప్రజాదరణ బాగా ఉంది.

2019లో విదేశాంగ విధానంపై అధ్యయనం చేసిన ఓ పరిశోధకుడు చెప్పిన వివరాల ప్రకారం.. అఫ్గాన్ ప్రజలు ఈ మార్కెట్​ నుంచి తీసుకున్న రుణాల విలువ.. ఆ దేశంలోని అన్ని బ్యాంకులిచ్చిన రుణాల కన్నా రెండు రెట్లు ఎక్కువ.

ఇదీ చూడండి: మా పాలన ఇలా ఉంటుంది... తాలిబన్ల కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.