ETV Bharat / international

పాకిస్థాన్​లో తొలి సిక్కు సెనేటర్​గా గురుదీప్​ సింగ్​!

author img

By

Published : Mar 12, 2021, 10:12 PM IST

సిక్కు మతస్థుడు మొట్టమొదటి సారిగా పాకిస్థాన్​ పార్లమెంట్​ ఎగువసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికార తెహ్రెక్​-ఈ- ఇన్​సాఫ్​ పార్టీకి చెందిన గురుదీప్​ సింగ్​ సెనేటర్​గా ఎన్నికయ్యారు.

Gurdeep Singh takes oath as Pakistan Senator
పాకిస్థాన్​ పార్లమెంట్​ సెనేటర్​గా సిక్కు మతస్థుడు

పాకిస్థాన్​ పార్లమెంట్​ ఎగువసభలో మొట్టమొదటి సారిగా తలపాగ ధరించిన సిక్కు ప్రతినిధిగా గురుదీప్​ సింగ్ ఎన్నికయ్యారు. అధికార తెహ్రెక్​-ఈ- ఇన్​సాఫ్​ పార్టీ తరఫున గెలుపొంది.. సెనేటర్​గా ప్రమాణ స్వీకారం చేశారు.

145 ఓట్లు ఉన్న సభలో 103 గురుదీప్​ సింగ్​కు ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి జమైత్​ ఉలేమా-ఈ- ఇస్లాం(ఫాజ్లుర్​)అభ్యర్థి రాజీంత్​ సింగ్​కు 25 ఓట్లు, మరో అభ్యర్థి ఆసిఫ్​ భట్టి( అవామీ నేషనల్​ పార్టీ)కి కేవలం 12 ఓట్లు మాత్రమే వచ్చాయి.

గురుదీప్​ సింగ్​తో పాటు మరో 47 మంది సెనేటర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా.. దేశంలో మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు సింగ్​.

ఇదీ చదవండి: 'సెనేట్ సీటు అమ్ముకొన్న ఇమ్రాన్ ఖాన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.