ETV Bharat / international

Afghan Crisis: తాలిబన్లతో చేతులు కలిపిన 'ఘనీ'!

author img

By

Published : Aug 21, 2021, 4:59 PM IST

Updated : Aug 21, 2021, 5:40 PM IST

అష్రఫ్​ ఘనీ సోదరుడు అష్మత్ ఘనీ అహ్మద్‌జాయ్‌ తాలిబన్లతో కలిసిపోయారని తెలుస్తోంది. ఇటీవల తాలిబన్లు అఫ్గనిస్థాన్​ను వశపరుచుకున్న నేపథ్యంలో అధ్యక్షుడుగా ఉన్న అష్రఫ్​ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు.

Ashraf Ghani's Brother Hashmat
తాలిబన్లతో చేతులు కలిపిన 'ఘనీ'

తాలిబన్ల చెరలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గనిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముందుగానే ఓటమిని ఊహించిన మాజీ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన సోదరుడు అష్మత్ ఘనీ అహ్మద్‌జాయ్‌ తాలిబన్లతో కలిసిపోయారని తెలుస్తోంది. తాలిబన్లకు తన మద్దతు ప్రకటిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తాలిబన్ల నాయకుడు ఖలీల్-ఉర్-రెహమాన్, వారి మత పండితుడు ముఫ్తీ మహ్మద్ జాకీర్ సమక్షంలో తన మద్దతు ప్రకటిస్తూ ప్రమాణం చేశాడు. అష్మత్‌ ఘనీ కూచిస్ గ్రాండ్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మద్దతుతో తాలిబన్లు మరింత చెలరేగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాలిబన్లు కాబుల్‌కు చేరుకొక ముందే అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే, ఆ సమయంలో భారీ నగదు, ఖరీదైన నాలుగు కార్లతో ఉడాయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన యూఏఈ నుంచి వీడియో సందేశంలో మాట్లాడారు. 'రక్తపాతాన్ని నివారించడానికి దేశాన్ని విడిచి వెళ్లాను. నాపై వస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. కావాలంటే యూఏఈ కస్టమ్స్‌లో నిర్ధారించుకోవచ్చు. దేశం నుంచి వచ్చేటపుడు కనీసం నా బూట్లు మార్చుకోనే సమయం కూడా లేదు. నాకు ముప్పు ఉందని తొందరగా వెళ్లాలని సెక్యూరిటీ చెప్పారు. దీంతో దేశాన్ని విడిచి యూఏఈ వచ్చాను' అని అష్రప్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Afghan news: తాలిబన్లు కిడ్నాప్ చేసిన భారతీయులు సేఫ్​!

Last Updated :Aug 21, 2021, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.