ETV Bharat / international

ఒక్కడిని కాపాడబోయి మొత్తం 8 మంది పిల్లలు మృతి

author img

By

Published : Jun 22, 2020, 11:48 AM IST

చైనాలో హృదయ విదారక ఘటన జరిగింది. నదీతీర ప్రాంతంలో సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన 8 మంది పాఠశాల చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. నదిలో పడిపోయిన స్నేహితుడిని కాపాడేందుకు ఏడుగురు విద్యార్థులు నీటిలోకి దూకేశారు.

Eight primary school children drown in river in China
ఒక్క స్నేహితుడిని కాపాడే క్రమంలో ఏడుగురు చిన్నారులు మృతి

నైరుతి చైనాలో విషాదం జరిగింది. 8 మంది పాఠశాల విద్యార్థులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయారు. టోంగ్నన్ జిల్లా టోంగ్​ జియా గ్రామానికి చెందిన వీరంతా ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఆడుకునేందుకు నదీతీరానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ చిన్నారి నీటిలో పడిపోయాడు. అతిడిని కాపాడేందుకు అక్కడున్న ఏడుగురు చిన్నారులూ నదిలోకి దూకేశారు. చివరకు అందరూ ప్రాణాలు కోల్పోయారు.

మృతదేహాలను అధికారులు నది నుంచి బయటకు తీశారు. వారంతా స్థానిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులని తెలిపారు.

ఇదీ చూడండి: ఉద్రిక్తతల వేళ ఒకేచోట భారత్​, చైనా రక్షణ మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.