ETV Bharat / international

'గల్వాన్​' మృతులపై తొలిసారి చైనా ప్రకటన

author img

By

Published : Feb 19, 2021, 8:01 AM IST

Updated : Feb 19, 2021, 9:26 AM IST

China was the first to reveal the details of the deaths in the Galvan incident
తొలిసారి 'గల్వాన్‌' మృతుల వివరాలు వెల్లడించిన చైనా

07:59 February 19

తొలిసారి 'గల్వాన్‌' మృతుల వివరాలు వెల్లడించిన చైనా

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​లో జరిగిన​ ఘర్షణలో మృతిచెందిన సైనికుల వివరాలను.. తొలిసారిగా బయటపెట్టింది చైనా​. ఘర్షణలో తమ దేశ జవాన్లు ఐదుగురు అమరులైనట్టు చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) ప్రకటించింది.  

గతేడాది జూన్ 15న జరిగిన ఈ ఘటనలో.. కారకోరం పర్వతాలపై పహారా కాస్తున్న ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు చైనా అధికారిక సైనిక వార్తాపత్రిక శుక్రవారం వెల్లడించింది. పీఎల్​ఏ జిన్​జియాంగ్, మిలటరీ రెజిమెంటల్​ కమాండర్​ క్వి ఫబావో, చెన్​ జియాంగ్​రంగ్​, జియావో సియువాన్​, వాంగ్​ జువారన్​ల పేర్లను బహిర్గతం చేసింది. దేశరక్షణ కోసం సరిహద్దులో వీరమరణం పొందిన ఈ జవాన్లకు ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక బిరుదులిచ్చి సత్కరించినట్టు కూడా పేర్కొంది.

ఇదీ చదవండి: త్యాగాల వెనుక కదిలించే గాథలు

ఈ ఘటనలో భారత జవాన్లు 20 మృతి చెందారని భారత్​ అప్పుడే ప్రకటించింది. కాగా.. చైనా మాత్రం ఆ వివరాలను ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచి ఎట్టకేలకు శుక్రవారం బహిర్గతం చేసింది. అయితే.. ఆ ఘర్షణలో చైనాకు చెందిన సుమారు 45మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్టు రష్యా నివేదించగా.. జిన్​పింగ్​ సర్కార్​ మాత్రం ఐదుగురే అని చెప్పుకోవడం గమనార్హం.

గతేడాది మే నుంచి సరిహద్దులో భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఈ క్రమంలోనే జూన్​లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. గల్వాన్​ లోయలో భారత సైనికులపై చైనా జవాన్లు దాడికి దిగారు. ప్రతిఘటించిన భారత్​.. చైనాకు దీటుగా బదులిచ్చింది. ఈ ఘటన ప్రపంచ దేశాలను షాక్​కు గురిచేసింది. అనంతరం సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా చర్చలు చేపట్టాయి.

ఇవీ చదవండి:

Last Updated : Feb 19, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.