ETV Bharat / international

'అంగుళం భూమినీ ఆక్రమించుకోలేదు'

author img

By

Published : Nov 17, 2021, 5:34 AM IST

తమది శాంతికాముక దేశమని, ఇతర దేశాలకు చెందిన అంగుళం భూభాగాన్నీ చైనా ఆక్రమించుకోలేదని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్​పింగ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో వర్చువల్​గా భేటీ అయిన (Biden XI meeting) జిన్​పింగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

China
చైనా

చైనా దూకుడుపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో తాజా సమావేశంలో జిన్​పింగ్​ స్పందించారు. తమది శాంతికాముక దేశమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో భేటీ అయిన (Biden XI meeting) చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఇప్పటివరకు తమకు తాముగా ఒక్క యుద్ధాన్ని కూడా ప్రారంభించలేదు. ఇతర దేశాలకు చెందిన అంగుళం భూభాగాన్నీ ఆక్రమించుకోలేదు. మా దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పరిరక్షించుకుంటాం. మా ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు"

-- షీ జిన్​పింగ్, చైనా అధ్యక్షుడు

అమెరికా.. తమతో ఘర్షణకు దిగడం మానుకొని ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని సూచించారు.

హాంకాంగ్ పౌరులపై, షింజియాంగ్ వీగర్లపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై జిన్​పింగ్ పరోక్షంగా స్పందించారు. మానవహక్కుల విషయంలో ఎక్కడైనా సరే చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని చెప్పారు. హక్కుల ముసుగులో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు'- బైడెన్​కు జిన్​పింగ్ డైరెక్ట్​ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.