ETV Bharat / international

మరో టీకాకు ఓకే చెప్పిన చైనా

author img

By

Published : Mar 16, 2021, 12:43 PM IST

కరోనా మహమ్మారిపై పోరులో చైనా అత్యవసర వినియోగానికి మరో టీకాకు ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆ దేశం మొత్తంగా నాలుగు వ్యాక్సిన్​లను అనుమతి ఇచ్చినట్లైంది.

China approves a fourth COVID-19 vaccine for emergency use
మరో టీకాకు ఓకే చెప్పిన చైనా

చైనా మరో కొత్త వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆ దేశం​ నాలుగు టీకాలకు అమోదం తెలిపినట్లైంది.

కొత్త టీకాను అన్​హూయ్ జిఫై లాంగ్‌కామ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, ఇండోనేషియాలో చివరి దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఇదీ చూడండి: చైనాలో విచ్చలవిడిగా కరోనా టీకా వినియోగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.