ETV Bharat / international

నేపాల్​లో వాన బీభత్సం .. 60మంది మృతి

author img

By

Published : Jul 13, 2020, 1:38 PM IST

నేపాల్​లో నాలుగు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 60 మంది చనిపోగా.. 41 మంది గల్లంతయ్యారు.

At least 60 people killed, 41 missing following flood and landslides in Nepal
నేపాల్​ వర్ష బీభత్సం... 60 మంది మృతి

నేపాల్​లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా.. ఇప్పటివరకు ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 మంది మరణించారు. మరో 41 మంది ఆచూకీ గల్లంతైంది. నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల.. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడమే కాకుండా, కొండచరియలు విరిగిపడుతున్నాయి.

నేపాల్​ వర్ష బీభత్సం... 60 మంది మృతి

పశ్చిమ నేపాల్​లోని మయాగ్డి జిల్లాలోనే వరద బీభత్సానికి 27 మంది మరణించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు.

At least 60 people killed, 41 missing following flood and landslides in Nepal
మృత దేహాల వెలికితీత
At least 60 people killed, 41 missing following flood and landslides in Nepal
సహాయక చర్యలు

ఇదీ చదవండి: మార్స్​ యాత్రకు కౌంట్​డౌన్​- రోవర్​ విశేషాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.