ETV Bharat / international

అఫ్గాన్​పై పాక్​ అవిరామ రాకెట్​ దాడులు!

author img

By

Published : Feb 2, 2021, 10:34 PM IST

At least 50 rockets fired from Pakistan landed in Afghanistan's Kunar
అఫ్గాన్​పై పాక్​ అవిరామ రాకెట్​ దాడులు!

పాకిస్థాన్​ భూభాగం నుంచి 50 రాకెట్లు దూసుకొచ్చాయని అఫ్గానిస్థాన్​ వెల్లడించింది. ఈ దాడుల వల్ల స్థానికుల ఆస్తులకు నష్టం జరిగినట్లు గవర్నర్​ తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

పాకిస్థాన్‌ వైపు నుంచి విరామం లేకుండా రాకెట్లు దూసుకొచ్చాయని అఫ్గానిస్థాన్​ పేర్కొంది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 50 రాకెట్‌ దాడులు జరిగినట్లు కునార్​ రాష్ట్ర గవర్నర్‌ మహ్మద్​ ఇక్బాల్‌ సయిద్​ వెల్లడించారు. ఈ రాకెట్లు.. రాష్ట్రంలోని షెల్టాన్​ జిల్లాలో ల్యాండ్​ అవడం వల్ల స్థానికుల ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఇక్బాల్​ తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇరు దేశాల మధ్య 2,400కిలోమీటర్ల డ్యూరండ్​ సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలోని కొన్ని గ్రామాలు రెండు దేశాల భూభాగాల్లోనూ ఉంటాయి. దీంతో ఇరు దేశాలు తరుచూ ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటారని ఓ వార్తా పేర్కొంది.

ఇదీ చూడండి: అమెరికాలో కాల్పులు- ఐదుగురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.