ETV Bharat / international

చైనాలో మలద్వార స్వాబ్​ పరీక్షలు

author img

By

Published : Jan 29, 2021, 7:24 AM IST

Anal swab tests the latest embarrassment emerging from Covid-19 crisis
చైనాలో మలద్వార స్వాబ్​ పరీక్షలు

చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. కొందరు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని భయాందోళనకు గురవుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారికి, వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలకు మలద్వారం వద్ద కూడా స్వాబ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆ దేశం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. అయితే.. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

చైనాలో కొవిడ్​-19 కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి పౌరులను ఓ కొత్త అంశం బెంబేలెత్తిస్తోంది. వైరస్​ నిర్ధరణకు ఇబ్బందికరమైన రీతిలో మలద్వార స్వాబ్​ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని మలద్వార స్వాబ్​ పరీక్షలను ఇటీవల ప్రారంభించింది చైనా. విదేశాల నుంచి వచ్చేవారు, అధిక రిస్కు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారిపై దృష్టిపెట్టినట్టు చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్​ టైమ్స్​' పేర్కొంది.

ఈ పరీక్ష ద్వారా కరోనా వైరస్​ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి వీలవుతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఓ మహిళ.. 'షియాహోంగ్షు' అనే సామాజిక మాధ్యమంలో ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన తనకు ముక్కు, గొంతు స్వాబ్​లు, రక్త, లాలాజల పరీక్షలతోపాటు మలద్వార స్వాబ్​ కూడా చేస్తామని అధికారులు చెప్పినప్పుడు తాను తీవ్ర మానసిక క్షోభకు గురైనట్టు చెప్పారామె. ఈ చర్య జుగుప్సాకరంగా ఉందని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: 'మాస్క్‌పై మాస్క్‌తో ప్రయోజనమెక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.