ETV Bharat / international

కరోనాపై ఆ పోస్టుల్ని ఇక తొలగించం: ఫేస్​బుక్​

author img

By

Published : May 28, 2021, 6:45 AM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 'కరోనా మానవ సృష్టే లేదా ప్రయోగశాలలో రూపొందించిందే' వంటి ఆరోపణలతో కూడిన పోస్టులను తమ యాప్​ల నుంచి తొలగించబోమని స్పష్టం చేసింది.

facebook
ఫేస్​బుక్​ కరోనా పోస్టులు

కరోనా వైరస్​ పుట్టుపూర్వోత్తరాలపై దర్యాప్తును ముమ్మరం చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్​ తమ దేశ నిఘా విభాగాన్ని ఆదేశించిన నేపథ్యంలో.. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్​ వ్యాప్తికి చైనా ప్రయోగశాల కూడా కారణమనే అంశాన్నీ దర్యాప్తు పరిధిలో చేర్చే అవకాశం ఉంది. వైరస్​ వ్యాప్తికి సంబంధించి చైనా వాస్తవాలను వెల్లడించాలంటూ వివిధ దేశాలు చేస్తున్న డిమాండ్లతో బైడెన్​ పాలనా యంత్రాంగం కూడా స్వరం కలిపినట్లయింది.

ఈ పరిస్థితుల్లో.. కరోనాపై అసత్యపు ప్రచారమనే అభిప్రాయంతో ఇప్పటివరకు తొలిగిస్తూ.. వస్తున్న 'కరోనా మానవ సృష్టే లేదా ప్రయోగశాలలో రూపొందించిందే' వంటి ఆరోపణలతో కూడిన పోస్టులను తమ యాప్​ల నుంచి తొలగించబోమని ఫేస్​బుక్​(ఇంటెగ్రిటీ) వైస్​ప్రెసిడెంట్​ రోజెన్​ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాకు సంబంధించి అసత్య సమాచారం సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతోందనే అభిప్రాయంతో అలాంటి పోస్టులన్నింటినీ ఎప్పటికప్పుడు తీసివేసేందుకు ఫేస్​బుక్​ యంత్రాంగం శ్రమిస్తోంది. వాటిపై హెచ్చరిక లేబుల్స్​ను పెడుతోంది.

ఇదీ చూడండి: 'వైరస్​ పుట్టుకపై అమెరికా రాజకీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.