ETV Bharat / international

రోదసిలో కొత్త చరిత్ర- రిచర్డ్ అంతరిక్ష యాత్ర సక్సెస్

author img

By

Published : Jul 11, 2021, 10:35 PM IST

Updated : Jul 12, 2021, 7:05 AM IST

Virgin Galactic spaceship success
వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతం

వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర దిగ్విజయంగా సాగి.. రిచర్డ్ బృందం భూమిని చేరుకుంది. దీంతో రోదసిలోకి వెళ్లి తిరిగి వచ్చిన తొలి తెలుగమ్మాయిగా కీర్తిగడించారు బండ్ల శిరీష.

వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతం

ఆకాశవీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల రిచర్డ్ బ్రాన్సన్‌ బృందం రోదసియాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని దాదాపు 90 నిమిషాలకు తిరిగి భూమికి చేరింది. రోదసిలోకి ప్రవేశించిన తొలితెలుగు మహిళగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఘనత సాధించారు.

అంతరిక్ష పర్యాటకమే లక్ష్యంగా వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ ఈ రోదసియాత్ర చేపట్టింది. మానవసహిత వ్యోమనౌక వీఎస్​ఎస్​ యూనిటీ-22ను వీఎంఎస్​ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరిదశలో సొంతప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ వ్యోమనౌకలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తోపాటు మరో ఐదుగురు ప్రయాణించగా వారిలో తెలుగు మహిళ 34ఏళ్ల బండ్ల శిరీష కూడా ఉన్నారు. నాలుగో వ్యోమగామిగా ఉన్న ఆమె.. వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహించారు.

Virgin Galactic team in space
అంతరిక్షంలో వర్జిన్​ గెలాక్టిక్​ టీం

ఈ యాత్రతో భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా బండ్ల శిరీష చరిత్రపుటలకు ఎక్కారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనాచావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష.. తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

ఈ యాత్ర జీవితకాలం గుర్తుండే అనుభవమని.. రోదసియాత్ర విజయవంతంగా పూర్తయిన తర్వాత రిచర్డ్ బ్రాన్సన్‌ అన్నారు. 17 ఏళ్లపాటు శ్రమించి తాము అంత దూరం వెళ్లటానికి కృషి చేసిన వర్జిన్‌ గెలాక్టిక్‌ బృందానికి రిచర్డ్ బ్రాన్సన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:

తొలి మహిళా స్పేస్‌ టూరిస్ట్‌.. బెత్‌ మోసెస్‌

'రిచ్' రోదసి​ ప్రయాణానికి రంగం సిద్ధం

'రిచ్'​ రోదసి ప్రయాణం సాగనుంది ఇలా..

అంతరిక్షానికి పర్యటకులు- ట్రయల్​ సక్సెస్​!

Last Updated :Jul 12, 2021, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.