ETV Bharat / international

Afghanistan Taliban: తాలిబన్లపై ఆ ముద్ర తొలగినట్లేనా?

author img

By

Published : Aug 29, 2021, 1:52 PM IST

UNSC drops Taliban reference from statement on 'terror'
ఉగ్రవాద ప్రకటనలో తాలిబన్ల పదాన్ని తొలగించిన ఐరాస

అఫ్గానిస్థాన్​లో క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన అనంతరం తాలిబన్లపై(Afghan Taliban) అభిప్రాయాన్ని మార్చుకుంది ఐరాస భద్రతా మండలి(UNSC). ఉగ్రవాదానికి సంబంధించి ఆగస్టు 16న విడుదల చేసిన ఓ ప్రకటన నుంచి తాలిబన్ల పదాన్ని తొలగించింది. అఫ్గాన్​ నుంచి ఇతర దేశాల పౌరులను స్వదేశం తరలించడం వారి సహకారం లేకుండా సాధ్యమై ఉండేది కాదని భావిస్తోంది.

తాలిబన్లపై(Afghan Taliban) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కన్పిస్తోంది. అఫ్గానిస్థాన్​లో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులే ఈ మార్పునకు కారణంగా తెలుస్తోంది. ఉగ్రవాదులపై ఆగస్టు 16న విడుదల చేసిన ఓ ప్రకటనలో తాలిబన్లను ప్రస్తావించిన ఐరాస.. ఆగస్టు 27 నాటి ప్రకటనలో మాత్రం తాలిబన్ల పదాన్ని తొలగించింది. తాలిబన్లు ప్రపంచానికి ముప్పు కాదని ఐరాస భద్రతా మండలి మొదటిసారి సూచన ప్రాయంగా ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టు మాసానికి యూఎన్​ఎస్​సీ​ ఛైర్మన్​గా(UNSC Chairman) ఉన్న భారత్​.. ఈ స్టేట్​మెంట్​పై ఏమాత్రం ఆలోచించకుండా సంతకం చేయడం గమనార్హం.

UNSC drops Taliban reference from statement on 'terror'
అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు

తాలిబన్లు అఫ్గానిస్థాన్​ను​ ఆక్రమించుకున్న(Afghanistan Crisis) మరునాడు ఆగస్టు 16న ఐరాస భద్రతా మండలిలో(UNSC) భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఓ ప్రకటనను విడుదల చేశారు.

"అఫ్గానిస్థాన్​లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను ఐరాస భద్రతా మండలి సభ్యులు మరోసారి పునరుద్ధాటిస్తున్నారు. ఉగ్రవాద దాడులకు, కార్యకలాపాలకు, ఇతర దేశాలను బెదిరించడం వంటి వాటికి అఫ్గాన్ కేంద్రం కాకూడదు. తాలిబన్లు గానీ, ఇతర ఏ వర్గం గానీ, వ్యక్తులు గానీ అఫ్గాన్​ భూభాగం.. మరే ఇతర దేశాల్లోని ఉగ్రవాదులకు మద్దతుగా ఉండొద్దు." అని ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఆగస్టు 27 విడుదల చేసిన ఇదే ప్రకటనలో తాలిబన్​ పదాన్ని పూర్తిగా తొలగించింది యూఎన్​ఎస్​సీ.

దీనిపై యూఎన్​ఎస్​సీలో భారత మాజీ శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్ధీన్ స్పందించారు. 'దౌత్య విధానంలో రెండు వారాలంటే చాలా ఎక్కువ సమయం. ప్రకటనలో 'టీ'(తాలిబన్​) పదం మాయమైపోయింది.' అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

తాలిబన్ల సహకారం వల్లే..

అఫ్గాన్​లో ప్రస్తుత పరిస్థితులను గమనించే ఈ ప్రకటనపై సంతకం చేసినట్లు యూఎన్​ఎస్​సీ అధికారులు తెలిపారు. అఫ్గాన్​లోని విదేశీయులను స్వదేశానికి తరలించడం తాలిబన్ల సహకారం లేకుండా సాధ్యమై ఉండేది కాదని పేర్కొన్నారు.

UNSC drops Taliban reference from statement on 'terror'
తాలిబన్లు

తాలిబన్లు అఫ్గాన్​ను(Afghanistan Taliban) ఆక్రమించుకున్నప్పటి నుంచి విదేశాలన్నీ తమ ప్రజలను స్వదేశానికి తరలిస్తున్నాయి. ఒక్క అమెరికానే లక్ష మందిని అప్ఘాన్ నుంచి తీసుకెళ్లింది. భారత్ ఇప్పటివరకు 565 మందిని తరలించింది. వీరిలో 175 మంది దౌత్య సిబ్బంది కాగా.. 263 మంది భారత పౌరులు. 112 మంది అఫ్గాన్ హిందువులు, సిక్కులు. 15మంది ఇతర దేశాలకు చెందినవారు.

యూఎన్​ఎస్​సీలోని ఇతర సభ్యులు తాలిబన్లతో సంబంధాలు కొనసాస్తున్నప్పటికీ భారత్​ దూరంగా ఉంది. అయితే తాజా ప్రకటనలో తాలిబన్లతో భారత్​ సంబంధాలు కొనసాగించే సూచనలు కనిపిస్తుండటం ఆందోళనకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: Afghanistan Crisis: అఫ్గాన్​ ప్రజలకు ఎందుకీ దుస్థితి?

Kabul Airport: అఫ్గాన్​లో మళ్లీ పేలుళ్లకు అవకాశం.. అమెరికా హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.