ETV Bharat / international

కరోనాను పసిగట్టే సూపర్​ స్మార్ట్​ 'మాస్క్'

author img

By

Published : May 19, 2020, 2:24 PM IST

అమెరికాకు చెందిన ఎమ్‌ఐటీ, హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సెన్సార్ల సహాయంతో కరోనాను గుర్తించే మాస్కును రూపొందించారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఈ మాస్కులు ధరించిన వెంటనే అవి ఒక రకమైన వెలుతురు ప్రసరింపజేసి.. మనల్ని అప్రమత్తం చేస్తాయి.

This Face Mask With Sensors Will Glow Warn Others If They Have Coronavirus
కరోనాను ఈ స్మార్ట్​ 'మాస్క్'​ ఇట్టే పసిగట్టేస్తుంది

కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిశోధకులు సరికొత్త ఉపకరణాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఎమ్‌ఐటీ(మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ), హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సెన్సార్ల సహాయంతో కరోనాను గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఈ సెన్సార్లు ఉన్న మాస్కులు ధరించిన వెంటనే అవి ఒక రకమైన వెలుతురును ప్రసరింపజేస్తాయి. ఆ వెలుగు కంటికి కనిపించనప్పటికీ థర్మల్‌ స్కానర్‌ సహాయంతో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఎలా పనిచేస్తాయి?

ఈ మాస్కుల్లో సెన్సార్లను పేపర్‌ లేదా ప్లాస్టిక్‌పై అతికించి దాన్ని జెనిటిక్‌ మెటీరియల్ సహాయంతో వస్త్రంతో కలిపి మాస్కులా రూపొందిస్తున్నారు. ఇది గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలలపాటు అలాగే ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. ప్రత్యేక సాంకేతికతతో రూపొందిన ఈ మాస్కులు ధరించిన వ్యక్తి.. గాలి పీల్చినప్పుడు అందులోని తేమ, మాట్లాడినప్పుడు నోటి నుంచి వెలువడే లాలాజలం తుంపర్లను సెన్సార్లు గ్రహిస్తాయి. వాటిలో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఒక రకమైన కాంతిని వెదజల్లుతాయి. ఆ కాంతిని ఫ్లోరీమీటర్స్ సహాయంతో వెంటనే గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఈ ఫ్లోరీమీటర్స్‌ను విమానాశ్రయాల భద్రతా ద్వారాల వద్ద, ఆస్పత్రుల్లో, జనసాంద్రత ఉండే ప్రదేశాల్లో అమర్చి కరోనా సోకిన వ్యక్తులను ముందుగానే గుర్తించవచ్చని పరిశోధన బృందంలో సభ్యుడైన జిమ్‌ కోలిన్స్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.