ETV Bharat / international

అంతరిక్షంలోకి డైనోసార్​.. ఆన్​లైన్​లో భారీ డిమాండ్​!

author img

By

Published : Jun 5, 2020, 10:19 AM IST

అమెరికా వ్యోమగాములు డగ్​ హార్లీ, బాబ్​ బెంకెన్​లు స్పేస్​ ఎక్స్​ మిషన్​లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే.. వారితో పాటు ఓ డైనోసార్​ వెళ్లిందని ఎంతమందికి తెలుసు. రాకెట్​ క్యాప్సూల్​లో ఆ డైనో.. గాల్లో తేలియాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అసలు డైనో ఏంటీ.. మనుషులతో సావాసం ఏంటి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ కథ చదవాల్సిందే!

The sparkly toy dinosaur that rode along on SpaceX's historic launch is now selling out almost everywhere
అంతరిక్షంలోకి డైనోసార్​.. ఆన్​లైన్​లో భారీ డిమాండ్​!

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా స్పేస్​ ఎక్స్​ చరిత్ర సృష్టించింది. డగ్​ హార్లీ, బాబ్​ బెంకెన్​లు అంతరిక్ష నౌక క్రూ డ్రాగన్​ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ యాత్రకు సంబంధించిన వీడియోలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూశారు. ఇందులో గాల్లో తేలుతున్న ఓ డైనోసార్​ విశేషంగా ఆకర్షించింది. అయితే అదో ఆటబొమ్మ అని తర్వాత తెలిసింది. ఆ రాక్షస బల్లి వీడియోలు సోషల్​ మీడియాలో తెగ వైరలయ్యాయి.

అయితే.. డైనో టాయ్​ను అంతరిక్షంలోకి ఎందుకు తీసుకెళ్లారో తెలుసా. జీరో గ్రావిటీ ఇండికేటర్​గా వాడేందుకే తన కుమారుడి దగ్గరనుంచి తీసుకెళ్లినట్లు వివరణ ఇచ్చారు వ్యోమగామి బెంకెన్​. ఆ బొమ్మ అంతరిక్షంలో గాల్లో తేలుతుంటే క్రూ సిబ్బంది జీరో గ్రావిటీలోకి చేరినట్టేనట.

''మాకిరువురికీ పిల్లలున్నారు. వారికి డైనోసార్​లపై అమితాసక్తి. ఇంట్లో ఉన్న ఆ బొమ్మలన్నింటినీ తీసుకొచ్చాం. ఇప్పుడు మా పిల్లలు సంతోషపడుతున్నట్టున్నారు.''

- ప్రయోగం తర్వాత బెంకెన్​

డైనో​ బొమ్మ విశేషాలు..

గత వారం స్పేస్​ ఎక్స్​ చారిత్రాత్మక ప్రయోగంలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది డైనోసార్​ బొమ్మ. ఇది ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. రాత్రికి రాత్రే స్టార్​గా మారిన ఆ డైనోసార్​ బొమ్మ మోడళ్లు అన్ని ప్రముఖ స్టోర్లలో భారీగా అమ్ముడయ్యాయి.

  • గులాబీ, నీలి రంగుల్లో ఉన్న ఈ ఆటబొమ్మను.. క్రూ డ్రాగన్​ జీరో గ్రావిటీ ఇండికేటర్​గా పనిచేసింది.
  • టీవైస్​ కంపెనీ ఫ్లిప్పబుల్​ కలెక్షన్​లో భాగంగా ఆ ఒరిజినల్​ డైనో.. 4.99 డాలర్లకు అమ్ముడుబోయింది. ఇప్పుడు టీవై, వాల్​మార్ట్​, మైకేల్స్​, జోఆన్స్​ వంటి ప్రముఖ రిటైల్​ స్టోర్లలోనూ ఈ బొమ్మలకు భారీగా డిమాండ్​ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఇప్పుడు స్టాక్ కూడా​ లేనంతగా.
  • అమెజాన్​ కూడా ఈ బొమ్మను పోలిన డైనోసార్​లను(నాక్​ ఆఫ్స్​) ఆన్​లైన్​లో విక్రయించడం ప్రారంభించింది. స్పేస్​ ఎక్స్​.. అంతరిక్షంలోకి వెళ్లిన టాయ్​ను పోలిన 'డెమో 2 డైనోసార్​ ప్లష్​ టాయ్'​లను 25 డాలర్లకు అమ్మకానికి పెట్టి కాసేపటికే సైట్​ నుంచి తొలగించింది.

ఆన్​లైన్​లోనూ నిరాశే..

మిగతా కంపెనీలు కూడా.. ట్రెమర్​లు అమ్ముడుపోయాయని పేర్కొంటున్నాయి. వాల్​మార్ట్​.. డైనో అవుట్​ ఆఫ్​ స్టాక్​ అని.. స్టోర్లు, ఆన్​లైన్​ రెండింటిలో స్టాక్​ లేదని మైకేల్స్​.. అన్ని ఆకారాల్లో డైనోలు లేవని జోఆన్స్​లు వెల్లడించాయి.

అమెజాన్​ బాటలోనే చాలా మంది డైనో నాక్​ ఆఫ్స్​లను సృష్టించి.. లాభాలు ఆర్జిస్తున్నారని 9టూ5మ్యాక్​ ఎడిటర్​ జాక్​ హాల్​ చెబుతున్నారు. టూపూ అనే ఓ వ్యాపారి.. స్పేస్ఎక్స్​ సెక్విన్​ డ్రాగన్​ ప్లష్​ టాయ్​ పేరిట డైనో బొమ్మలను 19.97 డాలర్ల చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవ ధరతో పోలిస్తే ఇది 15 డాలర్లు ఎక్కువే.

The sparkly toy dinosaur that rode along on SpaceX's
టీవైస్​ డైనో

ట్రెమర్​ ఇన్​ స్పేస్​..!

ఆటబొమ్మలను తయారుచేసే కంపెనీ టీవై.. ఆ డైనో టాయ్​ను తయారుచేసింది. తమ ఫ్లిప్పబుల్స్​ కలెక్షన్​లో భాగంగా వీటిని అమ్మకానికి ఉంచింది. టీవై.. ఇప్పటికీ తన వెబ్​సైట్​ ద్వారా అమ్మకాలు జరుపుతోంది. కానీ ట్రెమర్​ అని పిలిచే డైనోలు అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. అయితే.. కింద నోట్​లో 'ట్రెమర్​ ఈస్​ నౌ ఇన్​ స్పేస్'​ (ట్రెమర్​ ఇప్పుడు అంతరిక్షంలో ఉందని) జోడించింది.

బెంకెన్​, హార్లీలు 110 రోజులు రోదసీలోనే గడపనున్నారు. ఆ తర్వాతే తిరిగి భూమిని చేరనున్నారు. అయితే.. జీరో గ్రావిటీ ఇండికేటర్​గా పనిచేసే ట్రెమర్​ డైనో వారితో పాటు తిరిగివస్తుందో స్పష్టత లేదు. లేకుంటే.. అంతరిక్ష కేంద్రంలోనే ఉండనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.