ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ- కీలక అంశాలపై చర్చ

author img

By

Published : Sep 23, 2021, 11:35 PM IST

Updated : Sep 24, 2021, 12:21 AM IST

modi us visit 2021
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​తో ప్రధాని మోదీ సమావేశం ()

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు చర్చలు జరిపారు. మోదీ, మోరిసన్​ల మధ్య భేటీ.. ఆస్ట్రేలియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.

తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. గురువారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​తో భేటీ అయ్యారు. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

modi us visit 2021
ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ
modi us visit 2021
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​తో ప్రధాని మోదీ సమావేశం

"భారత్​-ఆస్ట్రేలియా మధ్య మైత్రి బంధాన్ని మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారు."

-ప్రధానమంత్రి కార్యాలయం

భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆస్ట్రేలియా ప్రధాని, మోదీల మధ్య ఫోన్​ కాల్​ సంభాషణ జరిగిన వారం తర్వాత.. వీరిరువురి మధ్య ప్రత్యక్ష భేటీ జరగడం ఇదే తొలిసారి.

'ఇదో కొత్త అధ్యాయం'

మోదీ, మోరిసన్​ల మధ్య భేటీ.. ఆస్ట్రేలియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా తెలిపారు.

"ఆస్ట్రేలియాతో భారత్​ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో సరికొత్త అధ్యాయం. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు చర్చించారు. కొవిడ్​-19, వాణిజ్య, రక్షణ, శుద్ధ ఇంధనం సహా వివిధ అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై వారు చర్చలు జరిపారు."

- అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

ఇటీవల ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య దిల్లీలో జరిగిన 'టు ప్లస్ టు' చర్చల తర్వాత మోదీ, మోరిసన్​ల మధ్య సమావేశం జరగడం గమనార్హం.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు కళ్లెం వేసే లక్ష్యంతో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా కలిసి 'ఆకస్'​ పేరుతో త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ మోరిసన్​ల మధ్య భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'ఆకస్'​ కూటమిలోకి భారత్​- అమెరికా ఏమందంటే?

ఇదీ చూడండి: Modi us visit 2021: అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Last Updated :Sep 24, 2021, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.