ETV Bharat / international

'మోడెర్నా టీకా 94.1% సమర్థవంతం'

author img

By

Published : Dec 31, 2020, 1:50 PM IST

మోడెర్నా టీకా 94.1 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు తేలింది. అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Moderna COVID-19 vaccine shows 94.1 per cent efficacy in trial: Study
'మోడెర్నా టీకా 94.1 శాతం సమర్థవంతం'

అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందించిన కొవిడ్ టీకా 94.1 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు తేలింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్​ ప్రాథమిక ఫలితాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలు 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్​'లో ప్రచురితమయ్యాయి.

ట్రయల్స్​లో భాగంగా 30 వేల మందికి టీకా, ప్లాసిబో ఇచ్చారు. ఇందులో ఎంపిక చేసిన ఫలితాలను తాజా అధ్యయనం విశ్లేషించింది. టీకా తీసుకున్నవారిలో 11 మందికి కరోనా సంబంధిత లక్షణాలు కనిపించగా.. ప్లాసిబో తీసుకున్నవారిలో 185 మందికి లక్షణాలు కనిపించాయి. ప్లాసిబో తీసుకున్నవారిలోనే తీవ్రమైన వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

ఇవి ప్రాథమిక ఫలితాలేనని, పూర్తి వివరాలను విశ్లేషించిన తర్వాత టీకా సమర్థత మరింత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు.

"టీకా ట్రయల్స్​ ఫలితాలపై అధ్యయనం కొనసాగుతోంది. వ్యాక్సిన్ పనితీరుపై కావాల్సిన సమాచారం వచ్చే కొద్ది నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లోనైతే టీకా 94.1 శాతం సమర్థతతో పనిచేసినట్లు తేలింది. ఈ ఫలితాలు ఉత్సాహకరంగా ఉన్నాయి."

-లిండ్సే బడెన్, అంటువ్యాధి శాస్త్ర నిపుణులు, బ్రిఘమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, అమెరికా

టీకా స్వీకరించిన తర్వాత తీవ్రమైన లక్షణాల నుంచి బాధితుల బయటపడతారని ఫలితాల్లో వెల్లడైందని లిండ్సే తెలిపారు. ఆస్పత్రుల్లో చేరే అవసరం లేకుండా టీకా ఉపయోగపడుతుందని అన్నారు. కొద్దినెలల పాటు శరీరంలో యాంటీబాడీలు పనిచేస్తాయని స్పష్టం చేశారు.

టీకా ట్రయల్స్​లో 79 శాతం మంది శ్వేతజాతీయులు, 10 శాతం ఆఫ్రో అమెరికన్లు పాల్గొన్నట్లు చెప్పారు. వీరిలో 20 శాతం మంది హిస్పానిక్ ప్రజలు ఉన్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.