ETV Bharat / international

హెచ్​-1బీ వీసా జారీపై రిపబ్లికన్ల కీలక ప్రతిపాదన

author img

By

Published : Mar 4, 2021, 10:17 AM IST

Legislation on H-1B visas introduced in US Congress
హెచ్​-1బీ వీసాపై రిపబ్లికన్ల కీలక ప్రతిపాదన

భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఆశించే హెచ్-1బీ వీసాలో సమూలమార్పులు కోరుతూ అమెరికా కాంగ్రెస్​లో బిల్లును ప్రవేశపెట్టారు రిపబ్లికన్​ సభ్యులు. ఈ మేరకు ప్రతినిధుల సభలో ముగ్గురు అమెరికన్ చట్ట సభ్యుల బృందం ఈ బిల్లును ప్రతిపాదించింది.

అమెరికాయేతరులకు హెచ్-1బీ వీసాపై ఇటీవలి కాలంలో జరిపిన నియమకాలు సహా.. భవిష్యత్తు నియామకాలను సైతం అడ్డుకునేందుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యులు మో బ్రూక్స్, మాట్ గెట్జ్, లాన్స్ గూడెన్​ల బృందం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. జాబ్స్ ఫస్ట్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా.. వలస విధానం, అమెరికన్ జాతీయత చట్టంలో అవసరమైన మార్పులు చేయడం ద్వారా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సరిదిద్దాలని వీరు ప్రతిపాదించారు.

అమెరికా కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ ఉద్యోగులను చేర్చుకోకుండా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు.

సాంకేతిక నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులను అమెరికన్​ కంపెనీలు నియమించుకునేందుకు హెచ్​-1బీ వీసాలు జారీ చేస్తుంది అగ్రరాజ్యం. భారత్, చైనాల నుంచి ఏటా వేల మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు నియమించుకుంటున్నాయి.

అయితే అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు మెజారిటీ ఉన్నందున.. ఈ బిల్లు నెగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

''అమెరికా నిపుణులను కనీసం రెండేళ్లపాటు కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించకూడదు. రెండేళ్ల తరువాత సైతం ఎటువంటి కారణం లేకుండా తొలగించొద్దు. అలాగే వలసేతర ఉద్యోగిని గడువు తేదీకన్నా ముందే ఉద్యోగం నుంచి తొలగిస్తే సదరు యాజమాన్యం భారీగా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు.''

-బ్రూక్స్, రిపబ్లికన్​ కాంగ్రెస్​ ప్రతినిధి.

తాను ప్రతిపాదించిన బిల్లు చట్టం రూపం దాలిస్తే లాటరీ వీసా కార్యక్రమానికి ముగింపు పడుతుందని బ్రూక్స్ పేర్కొన్నారు. గతంలో అర్హతలతో సంబంధం లేకుండా 50,000కు పైగా గ్రీన్ కార్డులను జారీ చేసి.. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీశారని ఆరోపించారు.

ఇదీ చదవండి: పోటీ నుంచి తప్పుకున్న భారతీయ అమెరికన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.