ETV Bharat / international

గుండెపై కరోనా ప్రభావం ఎలా అంటే..?

author img

By

Published : Mar 4, 2021, 6:11 AM IST

కరోనా ప్రభావం మానవుల్లో ముఖ్య అవయవమైన గుండెపై ఎలా ఉంటుందనే విషయంపై శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ వైరస్‌ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పరిశోధన వివరాలను అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించారు.

how-coronavirus-infection-interferes-with-heart-function-decoded
గుండెపై కరోనా ప్రభావం ఎలా అంటే..?

మానవుల్లో ప్రధాన అవయవం అయిన గుండెపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ వైరస్‌ గుండె లోపలి కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తున్నాయని తెలిపారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో వివరాలు ప్రచురించారు. కరోనా సోకిన తర్వాత చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతుండటంతో పరిశోధకులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. కరోనా వైరస్‌ గుండె లోపలి కణాలపై దాడి చేసి చంపేయడంతో దాని ప్రభావం గుండె సంకోచ వ్యాకోచాలపై పడుతున్నట్లు వారు గుర్తించినట్లు తెలిపారు. సాధారంగా ఇలాంటి పరిస్థితుల్లో గుండెలో మంట వస్తుంది. కానీ కరోనా కారణంగా ఈ సమస్య ఎదురైతే మంట వంటి లక్షణాలు కూడా కనిపించట్లేదని పరిశోధనలో పాల్గొన్న కోరీ జె లావినె తెలిపారు.

కరోనా వైరస్‌ ప్రధానంగా గుండె లోపలి కణాలతో పాటు, రోగ నిరోధక వ్యవస్థలోని టి, బి కణాలపై దాడి చేస్తుందన్నారు. ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా దాడి చేయడం వల్ల గుండె భిన్నంగా ప్రతిస్పందిస్తున్నట్లు గమనించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. యువకుల్లో వారు చేసే శారీరక శ్రమ ఆధారంగా లక్షణాల్లో స్వల్ప మార్పులుంటాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.