ETV Bharat / international

కరోనా విలయం.. 3.60 కోట్లు దాటిన కేసులు

author img

By

Published : Oct 7, 2020, 7:57 AM IST

Updated : Oct 7, 2020, 11:48 AM IST

ప్రపంచ దేశాలపై కొవిడ్​ రక్కసి మహా విలయం కొనసాగుతోంది. రోజురోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 3.60 కోట్ల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. పదిన్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో వచ్చే ఏడాది జనవరి చివరివరకు అత్యవసర పరిస్థితిని కొనసాగించనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. న్యూయార్క్​లోని వైరస్​ హాట్​స్పాట్​లలో మళ్లీ లాక్​డౌన్​ విధించనున్నట్లు తెలుస్తోంది.

Global COVID-19
కరోనా విలయం

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వైరస్​ కోరల్లో చిక్కుకొని ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. కొవిడ్​ సోకిన వారి సంఖ్య 3.60 కోట్లు దాటింది. మరణాల సంఖ్య పదిన్నర లక్షలు దాటింది. అమెరికా, భారత్​, బ్రెజిల్​, రష్యాలతో పాటు పలు దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

మొత్తం కేసులు: 36,037,992

మరణాలు: 1,054,514

కోలుకున్నవారు: 27,143,863

యాక్టివ్​ కేసులు: 7,839,615

  • అమెరికాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 77 లక్షల మార్క్​ను దాటింది. 2.15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్​లో వైరస్​ విజృంభిస్తోంది. కరోనా హాట్​స్పాట్​ కేంద్రాలతో పాటు సమీప ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధించనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్​ ఆండ్రూ కూమో తెలిపారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యాపారాలు, చర్చిలు, పాఠశాలలపై ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.
  • ఇటలీలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 31 వరకు దేశంలో కొవిడ్​-19 అత్యవసర పరిస్థితిని కొనసాగించనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 3.30లక్షలకు చేరింది. 36 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. మరణాలు లక్షా 47 వేలు దాటాయి. మరోవైపు కొవిడ్​ బారి నుంచి ఇప్పటి వరకు 43.5 లక్షలకుపైగా కోలుకోవటం ఊరట కలిగిస్తోంది.
  • రష్యాలో కొవిడ్​ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. 12.37 లక్షల కేసులతో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉన్న రష్యా.. మరణాలను మాత్రం కట్టడి చేయగలిగంది. భారీగా కేసులు నమోదవుతున్నా ఇప్పటి వరకు 21వేల మంది మాత్రమే మరణించారు. దాదాపు 10 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • దక్షిణ కొరియాలో మరో 114 కేసులు వెలుగుచూశాయి. వారం వ్యవధిలో ఇవే అత్యధికం.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా..

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా7,722,746215,822
బ్రెజిల్4,970,953147,571
రష్యా1,237,50421,663
కొలంబియా869,80827,017
స్పెయిన్865,631 32,486
పెరు 832,92932,914
అర్జెంటినా824,46821,827
మెక్సికో794,60882,348
Last Updated : Oct 7, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.