ETV Bharat / international

టైమ్ 'కిడ్​ ఆఫ్ ​ద ఇయర్'​గా గీతాంజలి

author img

By

Published : Dec 4, 2020, 2:37 PM IST

ప్రముఖ టైమ్​ మ్యాగజైన్​ తొలిసారి ప్రకటించిన 'కిడ్​ ఆఫ్ ​ద ఇయర్​'గా 15 ఏళ్ల శాస్త్రవేత్త గీతాంజలి నిలిచింది. మ్యాగజైన్​ కవర్​పేజీపై ఆమె ముఖచిత్రం ప్రచురితమైంది.

Gitanjali Rao
టైమ్ మ్యాగజైన్​ 'ఫస్ట్​ కిడ్​ ఆఫ్​ది ఇయర్'​గా గీతాంజలి

15 ఏళ్ల శాస్త్రవేత్త, ఆవిష్కర్త గీతాంజలి రావ్​ ప్రముఖ టైమ్​ మ్యాగజైన్ తొలిసారి ప్రకటించిన​ 'కిడ్​ ఆఫ్ ​ద ఇయర్'​గా నిలిచింది. అమెరికా కొలరాడోలోని దెన్​వర్​కు చెందిన ఈ చిన్నారి వివిధ రంగాల్లో ఎన్నో కొత్త సాంకేతికతలను ఆవిష్కరించింది.

ఏం కనిపెట్టింది?

  1. తాగునీటిలో సీసం ఎంత మొత్తం ఉందో గుర్తించే పరికరం.
  2. సైబర్​ బెదిరింపులను గుర్తించి, కృత్రిమ మేధతో పనిచేసే ఓ యాప్​.

అమెరికా నుంచి 5 వేల మంది అభ్యర్థులు ఇందుకోసం పోటీపడ్డారు. చివరకు తుదిపోటీకి ఐదుగురు రాగా అందులో గీతాంజలి విజేతగా నిలిచింది. ఆమెతో పాటు ఫైనల్​ చేరిన మిగిలిన నలుగురిని వచ్చే శుక్రవారం సత్కరించనున్నారు. ఇటీవల నటి ఏంజెలినా జోలితో ముఖాముఖిలో పాల్గొంది గీతాంజలి.

"నేను ఏమీ అంత పెద్ద శాస్త్రవేత్తను కాను. ఏదైనా కొత్తగా ఆలోచిస్తాను. నా లక్ష్యం మారింది. ప్రపంచ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం ఒకటే నా బాధ్యత కాదు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాను. నేను చేయగలిగితే మీరు చేయగలరు, ఎవరైనా చేయగలరు."

- గీతాంజలి, శాస్త్రవేత్త

1927 నుంచి టైమ్​ మ్యాగజైన్​ 'మ్యాన్​ ఆఫ్​ ద ఇయర్'ను ప్రకటిస్తోంది. తర్వాత దానిని 'పర్సన్​ ఆఫ్​ దిఇయర్'గా మార్చింది. అయితే 'కిడ్​ ఆఫ్​ ద ఇయర్'​ను ప్రకటించడం ఇదే తొలిసారి.​

గత ఏడాది పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బెర్గ్ 16 ఏళ్లకే​ టైమ్​.. 'పర్సన్​ ఆఫ్ ద ఇయర్​'గా నిలిచింది. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.