ETV Bharat / international

గాంధీ అభివృద్ధి ఫౌండేషన్‌కై అమెరికన్‌ కాంగ్రెస్‌లో బిల్లు

author img

By

Published : Dec 22, 2019, 7:58 AM IST

భారత జాతిపిత కన్న కలలు సాకారం చేసే దిశగా అమెరికా ముందడుగు వేసింది. ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు ఒక బిల్లును అమెరికన్​ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకుని అమెరికా పౌరహక్కుల నేత, కాంగ్రెస్​ సభ్యుడు జాన్​ లూయిస్​ ఈ బిల్లును ప్రవేెశపెట్టారు.

Development of Mahatma Gandhi Foundation in America
మహాత్మాగాంధీ అభివృద్ధి ఫౌండేషన్‌ ఏర్పాటుకు అమెరికన్‌ కాంగ్రెస్‌లో బిల్లు

మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ల స్వప్నాలను సాకారం చేసే దిశగా ఓ ఫౌండేషన్‌ ఏర్పాటుతో సహా పలు ప్రజాహిత కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అమెరికాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల నేత, కాంగ్రెస్‌ సభ్యుడు జాన్‌ లూయిస్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

గాంధీ-కింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు...

రాబోయే ఐదేళ్లలో ఈ కార్యక్రమాల కోసం సుమారు రూ.1050 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని అభ్యర్థించారు. ‘గాంధీ-కింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేసి, దాని ద్వారా ఆరోగ్యం, కాలుష్యం, వాతావరణ మార్పులు, విద్య, మహిళా సాధికారత సాధనకు తమవంతు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందజేసేందుకు కృషి చేయాలన్నది బిల్లు ఉద్దేశం. ఇక, ‘గాంధీ-కింగ్‌’ మేధావులు పరస్పరం ఉభయదేశాల్లో నిర్వహించే వార్షిక విద్యా చర్చావేదికలలో పాల్గొనేందుకు ఉద్దేశించిన అంశాన్నీ ఈ బిల్లులో పొందుపరిచారు.

ఇదీ చూడండి: మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'

Hyderabad, Dec 22 (ANI): People gathered at AIMIM president Asaduddin Owaisi's rally read Preamble of the Constitution along with him. The rally was organised over Citizenship (Amendment) Act, 2019 at Darussalam in Hyderabad. Nationwide protests against CAA are being held since past few days.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.