ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 6.71కోట్లు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Dec 6, 2020, 10:40 PM IST

WORLD CORONA UPDATES
ప్రపంచ వ్యాప్తంగా 6.71కోట్లు దాటిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలపై కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 6కోట్ల 71లక్షలకుపైగా వైరస్​ కేసులు నమోదయ్యాయి. వారిలో 15లక్షల 38వేల మందికిపైగా వైరస్​కు బలయ్యారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాలలో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 6.71 కోట్ల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. వారిలో 15.38 లక్షల మందిని కొవిడ్​ బలితీసుకుంది. ఇప్పటివరకు 4కోట్ల 64లక్షల మంది వైరస్​ను జయించారు. కోటీ 91లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

  • కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో వైరస్​ అంతకంతకూ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 1.5కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.87లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.
  • రష్యాలో ఆదివారం ఒక్కరోజే 29,039 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 60వేలు దాటింది. ఆ దేశంలో ఇప్పటివరకు 43,141 మందిని కరోనా బలితీసుకుంది.
  • టర్కీలో వైరస్​ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 30వేలకుపైగా కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి.
  • పాక్​లో మరో 3,308 మంది కరోనా బారినపడగా.. నేపాల్​లో 1,096 కేసులు బయటపడ్డాయి.

ఇదీ చదవండి: ప్రకృతి మాయాజాలం- నదిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.