ప్రపంచవ్యాప్తంగా కరోనా రికార్డు.. కొత్తగా 2లక్షల22వేల కేసులు

author img

By

Published : Jul 10, 2020, 8:18 AM IST

world
ప్రపంచంపై కరోనా పంజా ()

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్​ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 2,22,825 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,404 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, భారత్​, రష్యాల్లో వైరస్ విజృంభిస్తోంది. బొలివియా అధ్యక్షుడికి కూడా కరోనా నిర్ధరణ అయింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. గురువారం ఒక్కరోజే 2,22,825 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,404 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్​, అమెరికా, బ్రెజిల్​లో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోంది. రోజూ కొత్తగా పుట్టుకొస్తున్న కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్​, భారత్​ల్లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే ఈ మూడు దేశాల్లోనే మహమ్మారి ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

world
ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు

కొత్తగా 960 మంది మృతి

అమెరికాలో గురువారం 61,067 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 960 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 30 లక్షలను దాటింది. అంటే 10 లక్షల జనాభాలో 100 మందికి వైరస్ సోకిందని అంచనా.

బ్రెజిల్​లో ఒక్కరోజులో 42వేలమందికి ..

బ్రెజిల్​లో ఒక్కరోజు వ్యవధిలోనే 42, 907మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. కొత్తగా 1,199 మంది మహమ్మారికి బలయ్యారు.

రష్యాలో కొత్తగా 6వేలమందికి..

వైరస్​ విజృంభణతో అతలాకుతలమవుతున్న రష్యాలో కొత్తగా 6,509 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 176మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడ 15 లక్షల సమాధులు సిద్ధం

దక్షిణాఫ్రికాలోనూ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 13,674 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలను దృష్టిలో పెట్టుకుని అంత్యక్రియల కోసం 15 లక్షల సమాధులను సిద్ధం చేసినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

ఆస్ట్రేలియాలో మళ్లీ విజృంభణ..

ఆస్ట్రేలియాలోనూ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది. ఎక్కువగా మెల్​బోర్న్​ నగరంలోనే కేసులు ఎక్కువగా ​నమోదవుతున్న నేపథ్యంలో 6 వారాల లాక్​డౌన్ ప్రకటించారు అధికారులు. మెల్​బోర్న్​లోని ఓ పాఠశాల కారణంగా అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 113 మందికి మహమ్మారి సోకగా.. 2,000 వేల మంది విద్యార్థులతో పాటు వంద మందికి పైగా సిబ్బందిని క్వారంటైన్​లో ఉంచారు.

జపాన్.. టోక్యోలో అధికం

జపాన్​ రాజధాని టోక్యోలో గురువారం 220 మందికి కరోనా సోకింది. ఏప్రిల్​ నుంచి ఈ స్థాయిలో కేసులు పెరగటం ఇదే తొలిసారి. ఇప్పటివరకు టోక్యోలో 7,000 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మూడింటిలో ఒక వంతు కేసులు ఇక్కడే ఉన్నాయి. మొత్తంగా అక్కడ 20,371 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 981 మంది వైరస్​కు బలయ్యారు.

నేపాల్​లో పెరిగిన కేసులు

గురువారం ఒక్కరోజులోనే నేపాల్​లో 108 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ వైరస్ కేసుల సంఖ్య 16,531కి చేరింది. అక్కడ ప్రస్తుతం 8,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

పాకిస్థాన్​లో కొత్తగా 3వేలకు పైగా కేసులు

దాయాది పాకిస్థాన్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ ఒక్కరోజులోనే 3,359 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 2,40,000 దాటింది. ఒక్కరోజులో 61 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 4,983 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: 'గాలిలోనూ కరోనా వైరస్ వ్యాప్తి- కానీ..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.